రోజా హర్ట్ చేసింది: పీతల సుజాత ఏడ్చారిలా(పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజా తన పైన చేసిన ఆరోపణలు నిరూపించాలని లేదంటే ఆమె అంబేడ్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని ఏపీ మంత్రి పీతల సుజాత సోమవారం అన్నారు.
దళిత మహిళ అని చూడకుండా తన పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తన పైన రోజా రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడమే కాకుండా తన శరీరతత్వం పైన విమర్శలు చేశారని పీతల సుజాత కంటతడి పెట్టారు. ఆమె రెండుమూడుసార్లు కన్నీరు కార్చారు.
తాను నిజాయితీతో బతుకుతున్నానని, తన బుర్ర ప్యాకేజీల కోసం ఆలోచించదని, పార్టీలు మార్చడం కోసం ఆలోచించదని, 420లా ఆలోచించదని, తప్పతాగి చిందులు వేయమని తన మనసు చెప్పదని పీతల సుజాత అన్నారు.

పీతల సుజాత
రోజా రెడ్డి ఓ దళిత మంత్రి పైన ఆరోపణలు చేస్తుంటే జగన్ రెడ్డి అడ్డుకోలేదని, అదే దళితుల పైన ఆయనకు ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు.

పీతల సుజాత
పీతల సుజాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. నీతి, నిజాయితీలకు మారుపేరు దళితులు అన్నారు. రోజా రెడ్డి అగ్రకుల దురహంకారంతో మాట్లాడుతున్నారన్నారు.

పీతల సుజాత
తన పైన వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. పార్టీ తరఫున ఏదో మాట్లాడాలని ఇష్టం వచ్చినట్లుగా నోరు జారొద్దన్నారు.

పీతల సుజాత
తాను ఎప్పుడు అహంభావంతో మాట్లాడలేదన్నారు. తాను లావుగా ఉన్నానని రోజా అంటున్నారని, ఆమె మాత్రం సన్నగా ఉందా అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications