నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం దక్కింది': సెంటిమెంట్‌పై కొట్టొద్దన్నారు, అసలేంటీ కథ?..

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ఆత్మగౌరవంగా బతకాలంటే ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలన్న ప్రాధాన్యతను ఇప్పుడు ప్రతీ ఒక్కరు గుర్తిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా దీనిపై విస్త్రుత స్థాయిలో అవగాహన కల్పిస్తుండటంతో.. మునుపటితో పోలిస్తే ఇటీవలి కాలంలో మరుగుదొడ్ల నిర్మాణం పెరిగింది.

గ్రామీణ ప్రాంతాల్లోను మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. కొన్నిచోట్ల పేదలకు ప్రభుత్వమే మరుగుదొడ్లను నిర్మించి ఇస్తోంది. మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి ఇంతలా ప్రచారం చేస్తున్నా.. కొన్ని గ్రామాల ప్రజలకు మాత్రం అవేవి పట్టడం లేదు. దీంతో అధికారులు వినూత్న రీతిలో ప్రచారానికి దిగారు.

'చెంబు చచ్చింది':

'చెంబు చచ్చింది':

బహిరంగ మల విసర్జనను రూపమాపడం, మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించే ఉద్దేశంలో భాగంగా నెల్లూరు జిల్లా అధికారులు ఆత్మగౌరవ దీక్షల పేరిట 41 రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా 'చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం దక్కింది' అన్న నినాదంతో చెంబులకు పాడె కట్టి వాటిని ఊరేగించారు. మండల టాస్క్‌ఫోర్స్‌ అధికారి నాగజ్యోతి ఆధ్వర్యంలో గురువారం పెళ్లకూరులోను ఈ ఊరేగింపు నిర్వహించారు.

గ్రామస్తుల నిరసన:

గ్రామస్తుల నిరసన:

చెంబుకు పాడె కట్టి ఊరేగించడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఊరేగింపును అడ్డుకుని.. ఇలాంటి కార్యక్రమాలు గ్రామానికి అరిష్టం చేస్తాయని వాదించారు. మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల తమకెలాంటి అభ్యంతరం లేదని, కానీ సెంటిమెంట్స్ ను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని వారు అంటున్నారు.

గ్రామస్తుల ఆగ్రహం:

గ్రామస్తుల ఆగ్రహం:

పూర్వ కాలం నుంచి చెంబుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేస్తూ.. శుభకార్యాల్లో కలశంగా.. అంత్యక్రియల వంటి కార్యక్రమాల్లో పవిత్రంగా వినియోగించే చెంబును ఇలా శవయాత్రలాగా ఊరేగించడం సరికాదని గ్రామస్తులు అంటున్నారు. చెంబును బహిర్భూమికి మాత్రమే వినియోగించరన్న విషయాన్ని గుర్తించాలని అంటున్నారు.

అధికారులతో వాగ్వాదం:

అధికారులతో వాగ్వాదం:


డప్పుల మోతలతో చెంబు శవయాత్ర ఊరేగింపు గ్రామంలోకి ప్రవేశించగానే.. గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. చెంబుకు పాడెకట్టి శవయాత్ర చేస్తూ ఊరంతా తిప్పడం మంచిది కాదని వారించారు. ఇలాంటి పనులు ఊరికి అరిష్టం చేస్తాయని, అధికారుల తీరు బాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులకు ఎంతగా నచ్చజెప్పినా వారు వినకపోవడంతో.. అధికారులు ఊరేగింపును మధ్యలోనే ఆపేసి వెనుదిరిగారు.

English summary
Nellore govt officials doing campaign over using toilets in villages, on Thursday Pellakuru villagers opposed their rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X