ఎమ్మెల్సీగా పెనుమత్స సూర్యనారాయణ రాజు ఏకగ్రీవం...

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెనుమత్స సూర్యనారాయణ రాజు (సురేష్‌ బాబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. వైసీపీ సంఖ్యాబలం,టీడీపీ పోటీలో లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి సూర్యనారాయణ రాజు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఏకగ్రీవ ఎన్నికను తాజాగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

తనకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూర్యానారాయణ ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

penumatsa surynarayana raju elected unanimously as mlc

వైసీపీ సీనియర్ నాయకుడు,దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు(89) తనయుడే సురేష్ బాబు. సాంబశివరాజు వైసీపీ ఆవిర్భావం నుంచి విజయనగరంలో పార్టీ అభివృద్దికి కృషి చేశారు. వయోభారం,అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆయన కన్నుమూశారు. పార్టీ పట్ల సాంబశివరాజు విధేయతను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన తనయుడికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

పార్టీలో అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని... తండ్రి లాగే పార్టీకి విధేయుడిగా ఉంటానని ఇటీవల నామినేషన్ సందర్భంగా సురేష్ బాబు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి చెడ్డ పేరును తీసుకురానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+