వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి వ‌స్తే : పీపుల్స్ అల‌యెన్స్ పైనే దృష్టి : ఢిల్లీ కి చంద్ర‌బాబు..!

|
Google Oneindia TeluguNews

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ళారు. కేంద్రంలోని నాన్ బిజెపి పార్టీల నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. మ‌రో వారంలో ఎన్నిక‌ల షెడ్యూల్ రానున్న ప‌రిస్థితుల్లో కేంద్రంలో అనుస‌రించాల్సిన వ్యూహాలు..ఎన్నిక‌ల‌కు ముందుగానే పొత్తుల పై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు.

బిజేపీత‌ర పార్టీల‌తో సమావేశం..
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు కీల‌క స‌మావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ బిజెపీత‌ర ప‌క్ష నేత‌ల‌తో సీయం స‌మావేశం కానున్నారు.భార‌త వాయుసేన ఉగ్ర‌వాదుల శిబిరాల పై దాడి అంశం పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇవే ప‌క్ష నేత‌ల‌తో ఫోన్ లో మాట్లాడారు. ఈ అంశం పై ఏ ర‌కంగా స్పందించాలి..ఏ ర‌కంగా ముందుకు వెళ్లాల‌ని అనే అంశం పై స‌మీక్షించారు.

People alliance before Elections : non Bjp parties meeting today..

ఈ రోజు జ‌రిగే స‌మావేశంలోనూ దీని పై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. అయితే, సైనికుల‌కు మ‌ద్దతుగా ఇప్ప‌టికే చంద్ర‌బాబు.. మ‌మ‌త ట్వీట్లు చేసారు. పార్టీ నేత‌ల‌తో టెలి కాన్ఫిరెన్స్ లోనూ చంద్ర బాబు దేశ భ‌ద్ర‌త విష‌యంలో రాజీ ప‌డ‌మ‌ని..అందులో రాజ‌కీయాల‌కు తావు లేద‌ని స్ప‌ష్టం చేసారు. ఢిల్లీలో జ‌రిగే స‌మావేశంలో ప్ర‌ధానంగా ఎన్నిక‌ల షెడ్యూల్..జాతీయ స్థాయిలో పొత్తుల అంశం పైనే చ‌ర్చించ‌నున్నారు.

పీపుల్ అల‌యెన్స్ పై నిర్ణ‌యం..
ఢిల్లీ స‌మావేశంలో ఏపి రాజ‌ధాని అమరావ‌తి లో టిడిపి నిర్వ‌హించే ధ‌ర్మదీక్ష పై ఓ నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉం ది. అమ‌రావ‌తి లో భారీగా నిర్వ‌హించే ఈ స‌భ‌కు జాతీయ నేత‌ల‌ను ఆహ్వానించాల‌ని ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి నిర్ణ యం తీసుకున్నారు. ఇక‌, ఎన్నిక‌ల ముందుగానే బిజెపి వ్య‌తిరేక పార్టీలు ఫ్రంట్ గా ఏర్ప‌డాల్సిన అవ‌స‌రం పై ఈ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు.

People alliance before Elections : non Bjp parties meeting today..

ఎన్నిక‌ల త‌రువాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి వ‌స్తే..రాష్ట్రపతి బిజెపి నే ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవ‌కాశం ఉంద‌ని..దీంతో..ఎన్నిక‌ల‌కు ముందుగానే ఫ్రంట్ గా ఏర్ప‌డి పోటీ చేస్తే ఎన్నిక‌ల త‌రువాత ఇబ్బంది ఉండ‌ద‌ని చంద్ర‌బాబు ఇత‌ర పార్టీల నేత‌ల‌కు వివ‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆప్‌- కాంగ్రెస్ మ‌ధ్య సీట్ల పంచాయితీ..పొత్తుల వ్య‌వ‌హారం పైనా ఇందులో చ‌ర్చించ‌నున్నారు. ఇక‌, జాతీయ స్థాయిలో ఏర్ప డే కూట‌మికి పీపుల్స్ అల‌యెన్స్ అని పేరు ఖ‌రారు చేసారు.

English summary
Anti bjp parties meeting today in Delhi. They may take decision on pre poll alliance in national level as peoples alliance. Ap Cm Chandra Babu proposing this alliance before elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X