ఆర్టీసీలో ఇప్పటిదాకా అధికారుల పాలన..ఇకపై ప్రజాపాలన:ఛైర్మన్ వర్ల రామయ్య
అమరావతి:ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తాజాగా ఆర్టీసీ ఛైర్మన్ గా నియమితులైన వర్ల రామయ్య ఆధ్వర్యంలో మొట్ట మొదటి పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఛైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ ఆర్టీసీలో ఇప్పటిదాకా అధికారుల పరిపాలన జరిగిందని...ఇక నుండి ప్రజా పాలన కొనసాగుతుందని చెప్పారు.
రాష్ట్ర విభజన తర్వాత మొట్ట మొదటి సమావేశం ఇదేననే విషయం గమనించాలని అన్నారు. ఆర్టీసీ సంస్థలో 58 నుండి 60 సంవత్సరాలకు ఉద్యోగుల వయో పరిమితి పెంచాలనే విషయంపై చర్చించామని చెప్పారు. అయితే ఈ విషయమై వచ్చే సమావేశంలో మరొక సారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.అలాగే వయోపరిమితి పెంపు అంశం పై న్యాయ సలహా తీసుకొనేందుకు ఈ సమావేశంలో తీర్మానం చేశారు.

ఆర్టీసీసంస్థ ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు నూతన ఆదాయ వనరులు కోసం అన్వేషిస్తున్నామని వర్ల రామయ్య చెప్పారు. రానున్న ఆర్టీసీని ఆర్థికంగా బాగా బలోపేతం చెయ్యాలన్నదే తన అభిమతమని వర్త రామయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications