చంద్రబాబు.. అక్రమంగా ఒక్క రూపాయి తిన్నట్టు నిరూపిస్తే.. నేను అది తిన్నట్టే: పేర్ని నాని

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని సవాల్ విసిరారు. బందరులో తన మీద చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశాడని తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర రాసిస్తే చదివే దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడుదని ఎద్దేవా చేశారు పేర్ని నాని.

తాను ఎక్కడైనా ఒక రూపాయి అక్రమంగా తిన్నానని నిరూపిస్తే, నాకు ఓటేసిన ప్రజల మలమూత్రాలు తిన్నట్టే అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. నమ్మకానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయితే వెన్నుపోటుకు, ద్రోహానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ పేర్ని నాని విమర్శించారు. బందరుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించిన పేర్ని నాని చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతాడని మండిపడ్డారు. బాబు అండ్ కో బందరును హల్వా తిన్నట్టు తిన్నారన్నారు.

 perninanicbn

2014లో ప్రజలకు ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేయలేదని ఔటర్ రింగ్ రోడ్డు, సాఫ్ట్ వేర్ కంపెనీలు తెస్తానని చంద్రబాబు హామీలు ఇచ్చారని, ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను పేర్ని నాని మీడియా సమావేశంలో ప్రదర్శించారు.ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీల వీడియోలను కూడా ప్రదర్శించి, తాము ఇచ్చిన హామీలలో 95% హామీలను ఇప్పటికే అమలు చేసినట్టుగా వెల్లడించారు.

చంద్రబాబు లాంటి పచ్చి రాజకీయ మోసగాడు ఎవరూ లేరని పేర్ని నాని మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, బావమరుదులను తడి గుడ్డలతో గొంతు కోసిన వాడు సైకో కాదా అని ఆయన నిప్పులు చెరిగారు. నమ్మి ఓటేసిన ప్రజలను అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచిన వాడు సైకో కాదా అంటూ మండిపడ్డారు.

perninani

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఏ ఒక్క మంచి పనైనా చంద్రబాబు చెప్పగలరా అంటూ నిలదీసిన పేర్ని నాని తన పాత పాలన తీసుకువస్తానని ప్రజలకు చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు. బందరు సభకు జనాలు రాకపోవడంతో చంద్రబాబు షాక్ అయ్యాడని వ్యాఖ్యానించారు. బందరు సభలో 2000కుర్చీలు వేసినా కనీసం నిండలేదని, ఖాళీ కుర్చీలకు గంటా 40 నిమిషాలు ప్రసంగించిన ఘనత చంద్రబాబుదేనని సెటైర్లు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+