పవన్ ను చూసి తట్టుకోలేకే-బాలయ్యపై పేర్ని ఫైర్..! చిరుకు థ్యాంక్స్..!
నిన్న అసెంబ్లీలో జగన్ పై బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన విమర్శలకు వైసీపీ నేత పేర్ని నాని ఘాటు కౌంటర్ ఇచ్చారు. కైకలూరు ప్రజల కష్టాలు పట్టని ఎమ్మెల్యే కామినేని అన్నారు. జనం తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టని కామినేనికి పట్టదన్నారు. కైకలూరులో దళితుల పై జనసేన నేతలు కత్తులతో దాడి చేస్తే మాట్లాడలేదన్నారు. ప్రజల కష్టాల గురించి మాట్లాడటం చేతకానోడు అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడన్నారు.80 ఏళ్లు మీదపడినా కామినేని శ్రీనివాస్ కు ఇంగితజ్ఞానం లేదన్నారు. ఊరుపొమ్మంటున్నా కాడి రమ్మంటున్నా ఈ వయసులో అసత్యాలు మాట్లాడటం భావ్యమేనా అని పేర్ని ప్రశ్నించారు. అర్జంట్ గా మంత్రి అయిపోవాలని కామినేని ఆరాటమన్నారు.
పవన్ ఉపముఖ్యమంత్రిగా హెలీకాప్టర్లలో తిరుగుతుండటం బాలకృష్ణ చూడలేకపోతున్నాడని, తన బావతో సమానంగా పవన్ జామర్ కార్లలో తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాడని పేర్ని విమర్శించారు. పవన్ కు చంద్రబాబు ఒంగి ఒంగి సలామ్ కొడుతుంటే కుతకుతలాడిపోతున్నాడన్నారు. బాలకృష్ణ వల్ల అసెంబ్లీ గేటు దగ్గర కూడా బ్రీత్ ఎనలైజర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బాలకృష్ణ తప్పతాగి కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడన్నారు. అసలు సైకో బాలకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ ను చూసి తట్టుతోలేని సైకో బాలకృష్ణ అన్నారు.

పురాణాలు,వేదాలు బట్టీ బడితే సరిపోదని, అన్నీ బట్టీపడితే ఇలానే ఉంటుందని బాలయ్యకు పేర్ని చురకలు అంటించారు.
పురాణాలు బట్టీ పట్టి.. మ్యాన్షన్ హౌస్ వేస్తే ఇలానే ఉంటుందన్నారు. బాలకృష్ణ స్వయంగా తనతో ఫోన్ లో మాట్లాడాడని,
తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పై ప్రమాణం చేసి చెబుతున్నానని, దమ్ముంటే నువ్వు నీ తల్లిదండ్రుల పై ప్రమాణం చెయ్యి బాలకృష్ణ అని సవాల్ విసిరారు.
నందమూరి తారకరామారావు, బసవతారకం వంటి వారి కడుపున పుట్టిన నువ్వు ఇంతలా దిగజారిపోవడం సిగ్గుచేటన్నారు.
అఖండ సినిమా కోసం బాలకృష్ణ తనకు స్వయంగా ఫోన్ చేశాడని, జగన్ మోహన్ రెడ్డితో అపాయింట్ మెంట్ ఇప్పించండి అని అడిగాడని పేర్ని గుర్తుచేశారు. బాలకృష్ణ ఫోన్ చేస్తే తానే జగన్ కు విషయం చెప్పానన్నారు. వాళ్లు ఏ సాయం అడిగితే అది చేసిపెట్టమని చెప్పిన గొప్ప వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ ఎంత సాయం చేశాడో మర్చిపోయావా బాలకృష్ణ అని అడిగారు. యావజ్జీవ శిక్ష నుంచి తప్పించుకున్న విషయం గుర్తు లేదా అన్నారు.
మనిషి జన్మ ఎత్తినవాడెవడైనా చేసిన సాయం మర్చిపోతాడా అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని కలవడం ఇష్టం లేకపోతే రావడం మానేయాలని, అంతేకానీ ఎందుకు ఈ సైకో మాటలని ప్రశ్నించారు. మీ బసవతారకం ఆసుపత్రి ఆరోగ్యశ్రీ బిల్లులు చేయించుకోలేదా అని అడిగారు చిరంజీవిని సొంత అన్నలాగా భావించి జగన్ మోహన్ రెడ్డి గౌరవించారని,మూడు,నాలుగేళ్ల నుంచి ఎన్నో అవమానాలను భరించామన్నారు. చిరంజీవి వెంటనే స్పందించినందుకు సంతోషం అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు వాగినప్పుడే చిరంజీవి ప్రకటన చేసుంటే ఇంకా బాగుండేదన్నారు.

నిజంగా మేం సినీపరిశ్రమను ఇబ్బంది పెట్టుంటే ఎందుకు ఇంకా మేం ఇచ్చిన జీవోలను అమలు చేస్తున్నారన్నారు. ఎందుకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలను కొనసాగిస్తున్నారని అడిగారు. అధిక ధరలు పెంచుకుంటూ పోతే సినీపరిశ్రమ దెబ్బతింటుందని జగన్ మోహన్ రెడ్డి ఆనాడే చెప్పారన్నారు. సినిమా ధియేటర్లు మూతపడి కళ్యాణ మండపాలుగా మారిపోతాయన్నారు ఏడాదికో సినిమా తీస్తే టెక్నీషియన్లు , క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైపోతారని జగన్ ఆనాడే సూచించారన్నారు. సినీ పరిశ్రమ గురించి జగన్ చాలా గొప్పగా ఆలోచించారని,సినీపరిశ్రమ మనుగడను కాపాడాలని కోరారన్నారు. సినీ పరిశ్రమకు స్థలాలు ఇస్తామన్నారు కదా అన్నారు. జగన్ ఆలోచనను గౌరవించి చిరంజీవి,రామ్ చరణ్ వైజాగ్ లో స్థలం కొన్నారన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ చిరంజీవి పెద్ద మనసుతో స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications