టీటీడీ చైర్మన్‌కే ఝలక్ ఇచ్చిన కేటుగాడు..ఏం చేశాడంటే..!
తిరుమలలో కేటుగాళ్ల సంఖ్య ఎక్కువైంది. కేటుగాళ్ల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి.భక్తుల నమ్మకాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.ఓ కేటుగాడు ఏకంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకే షాకిచ్చాడు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.తిరుమల శ్రీవారి దర్శనార్థం రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.దర్శనం కల్పిస్తామని చెప్పి అమాయకులైన భక్తులు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే వాళ్లు తిరుపతిలో ఎక్కువయ్యారు.
ఓ కేటుగాడు ఏకంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫొటోను వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుని గుడికి వస్తోన్న భక్తులను మోసం చేస్తున్నాడు.టీటీడీ ఛైర్మన్ ఫొటో పెట్టుకుని భక్తులను మోసం చేస్తున్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు.వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తానని ఎన్నారై భక్తులను టార్గెట్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు టీటీడీ చైర్మన్ దృష్టికి రావడంతో అతన్ని గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మోసగించిన వ్యక్తి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్ జావెద్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు.దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దీనిపై చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా స్పందిస్తూ...తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను మోసగించే వారి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండలంటూ సూచించారు.స్వామివారి దర్శనంలో ఎలాంటి రికమండేషన్ పని చేయదని, ఇటువంటి వారిని సంప్రదించి భక్తులు మోసపోవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications