మోడీ అంటే ఇష్టం, హోదాపై నా వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారు: పవన్ మనసులో మాట
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోడీ అంటే ఇష్టమే అయినా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జనం అభిప్రాయం మరో రకంగా ఉందని వ్యాఖ్యానించారు. అందుకే ఏపీలో బీజేపీ బలహీనపడిందన్నారు.

తాను ఇప్పుడు జనం కోసం మాట్లాడుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనం సమస్యల పైన పోరాడుతానని చెప్పారు. ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనసులో మాట బయటపెట్టారు.
ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్నారనే విమర్శలపై పవన్ ట్విట్టర్లో స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని చెప్పారు. హోదాతోనే అన్నీ చేయలేమని, చట్టంలో పొందుపర్చిన అన్నీ ఇవ్వాలని చెప్పానని తెలిపారు. హోదాతో పాటు ఏపీకి అదనంగా నిధులు రావాలన్నారు.












Click it and Unblock the Notifications