అమరావతిలో హిందుత్వానికి ప్రాధాన్యతపై హైకోర్టుకు, రైతుకు సత్కారం.. వారికి బాబు అండ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనలో హిందూమత సంప్రదాయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో సోమవారం నాడు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

అమరావతి శంకుస్థాపనలో హిందూమత సంప్రదాయంతో పాటు క్రైస్తవ, ముస్లీం మత సంప్రదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. దీనిని స్వీకరించిన కోర్టు వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.

Petition in High Court over AP capital

అమరావతి... చేనేత కార్మికులకు ప్రభుత్వం అండ

ఈ నెల 22వ తేదీన ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోడీ, దేశ విదేశీ ప్రముఖులు శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇదే సమయంలో రాజధానికి భూములు ఇచ్చిన 24వేల మంది రైతులను కూడా ప్రభుత్వం గౌరవించనుంది.

24వేల మంది రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించి, వారికి ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా రైతులకు బట్టలతో సత్కరించనున్నారు. ప్రభుత్వం మగవారికి పంచె, దోతి, ఆడవారికి చీర, జాకెట్టుతో సత్కారం అందించనుంది.

రైతులను సత్కరించే ఉద్దేశ్యంలో భాగంగా ఇందుకు అవసరమైన దుస్తులను ప్రభుత్వం చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తుంది. తద్వారా చేనేత కార్మికులకు అండగా నిలువనుంది.

రాజమహేంద్రవరం చేనేత కార్మికులు తయారు చేసిన వాటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీనిపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ వస్త్రాలు కొనుగోలు చేస్తోన్నందుకు సంతోషంగా ఉందని చెబుతున్నారు. చంద్రబాబుకు వారు ధన్యవాదాలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+