ఫార్మసీ విద్యార్ధినిపై నాలుగు నెలల పాటు అత్యాచారం
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాల్వంచలో ఫార్మసీ చదువుతున్న 19ఏళ్ల యువతిపై నలుగురు యువకులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. తొలుత హుస్సేన్ అనే విద్యార్థి ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి ఆమెను లొంగదీసుకున్నాడు.
యువతిని లొంగదీసుకున్న దృశ్యాలను యువతికి తెలియకుండా సెల్ ఫోన్‌లో చిత్రీకరించి తన స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో హుస్సేన్ ముగ్గురు స్నేహితులు యువతిని బ్లాక్ మెయిల్ చేశారు. నాలుగు నెలల పాటు యువతిపై అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు.

గర్భవతి అయిన యువతికి అబార్షన్ కూడా చేయించారు. ఇది ఇలా ఉంటే హుస్సేన్ తాను తీసిన వీడియోని మరొకరికి విక్రయించాడు. వీడియో దృశ్యాలను చూసిన ఆ వ్యక్తి కూడా బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర మానసకి వేదనకు గురైన బాధితురాలు నిద్రమాత్రులు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
జరిగిన విషయాన్ని ఆత్మహత్యాయత్నానికి ముందు బాధితురాలు సునీల్ అనే స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పింది. సునీల్ ద్వారా విషయం తల్లిదండ్రులకు, బంధువులకు తెలిసింది. కుమార్తెకు జరిగిన అన్యాయం తట్టుకోలేక బాధిత తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
బాధితురాలి తల్లిదండ్రులు చావు బ్రతుకలు మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్నేహితులు, బంధువుల సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications