'ఫోన్ ట్యాపింగ్ అతిపెద్ద నేరం, కేసీఆర్ సర్కారుకు ఉరితాడే'
ఏలూరు: ఇతర వ్యక్తుల ఫోన్లను అనుమతులు లేకుండా ట్యాపింగ్ చేయడం అతిపెద్ద నేరమని, గతంలో ఈ చర్యలకు పాల్పడిన పలు ప్రభుత్వాలు కుప్పకులాయని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆదివారం అన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే సభలు రద్దయి ఎన్నికలు జరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు. తెలంగాణకు చెందిన రేవంత్ రెడ్డి విషయంలో తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. డబ్బు ఇచ్చిన వారితో పాటు తీసుకున్న వారు కూడా నేరస్తులేనని చెప్పారు.

రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అదే వీడియో టేపుల్లో ఉండి డబ్బులు తనకు వద్దని చెప్పని స్టీఫెన్ సన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడిన కేసీఆర్‌ను అరెస్టు చేయాలన్నారు. ఆంధ్ర ప్రాంతం వారి గురించి బలహీనంగా మాట్లాడుతున్నారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్‌కు, ఆయన ప్రభుత్వానికి ఉరితాడేనని మంత్రి పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ తదితరులు అన్నారు. హైదరాబాదులో ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని చెప్పారు. సెక్షన్ 8 గురించి కేసీఆర్ నానాయాగీ చేయడం విడ్డరమన్నారు. కాగా, సెక్షన్ 8 అమలు చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.












Click it and Unblock the Notifications