ఫోన్ ట్యాపింగ్‌పై చంద్రబాబుకు కేంద్ర షాక్: ఎవరా ఎపి కేంద్ర మంత్రి?
న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్ డేటాను ఇవ్వకూడదని సర్వీస్ ప్రొవైడర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. శుక్రవారం కోర్టులో సర్వీస్ ప్రొవైడర్లు అదే విషయం చెప్పారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కేంద్ర మంత్రి ఫోన్ ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. ఎవరా కేంద్ర మంత్రి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మంత్రి తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ తెలంగాణ టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పట్టుబడడానికి కొద్ది రోజుల ముందు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, కేంద్ర మంత్రి ల్యాండ్ లైన్ ఫోన్ టాప్ అయిందని, ఈ విషయాన్ని నిఘా వర్గాలు ఆయనకు తెలిపాయని సమాచారం.
ఈ కేంద్రమంత్రి మరో పార్టీకి చెందిన కీలక నేత ఒకరితో మాట్లాడుతున్న సంభాషణలను ట్యాప్ చేసినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో పరిస్థితులు, పలువురు ఎమ్మెల్యేల అసంతృప్తి గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు, రాజకీయ పార్టీల్లో ఇలాంటివి సహజమేనని, వాటిని పట్టించుకోవద్దని ఆ కేంద్ర మంత్రి చెప్పినట్లు తెలు స్తోంది.

సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. తాము ట్యాపింగ్ చేయలేదని తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ అధికారులు వాదిస్తున్న సమయంలో ఒకరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారికంగానే సర్వీస్ ప్రొవైడర్లు చర్యలు తీసుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఈ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది.
ప్రభుత్వాలు సంయమనంతో చట్టాలకు లోబడి వ్యవహరించాలని సూచిస్తూ తెలంగాణకు మరో లేఖ పంపింది. ఏపీ సీఎం చంద్రబాబుసహా అనేక మంది ప్రముఖుల సెల్‌ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలపై ఏపీలో అనేక కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆధారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేకరించి కేంద్ర టెలీకమ్యూనికేషన్ శాఖకు, హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఎవరి ఆదేశాల మేరకు తమ ఫోన్లు ట్యాప్ చేశారో చెప్పాలంటూ సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది.
సర్వీస్ ప్రొవైడర్ల విజ్ఞప్తితో టెలికం శాఖ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటు, సర్వీస్ ప్రొవైడర్లకు కూడా తగిన సూచనలతో ఒక లేఖ రాసింది. ఇంటర్‌సెప్ట్ (ట్యాపింగ్) డేటా సర్వీస్ ప్రొవైడర్ల వద్ద లేదని, అది తెలంగాణ నిఘావర్గాల వద్ద మాత్రమే ఉందని ఈ లేఖలో తెలిపింది.












Click it and Unblock the Notifications