ఎమ్మెల్యేకి చుక్కలు!: బిల్డింగ్ దిగొచ్చినా.. (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకోవద్దంటూ హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు ఒంగోలు, చీరాలలోను టిడిపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం పలువురు కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ ఎక్కిన విషయం తెలిసిందే. మంగళవారం ఒంగోలులోని జిల్లా టిడిపి కార్యాలయం ముందు కార్యకర్తలు ఆందోళన చేశారు.
ఆమంచిని పార్టీలో చేర్చుకోవద్దంటూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆమంచి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్ పైకి ఎక్కి ఆందోళన చేసిన కార్యకర్తలు.. ఆ తర్వాత దిగి వచ్చి కార్యాలయం ముందు బైఠాయించారు.

ఆమంచి
సోమవారం పలువురు చీరాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకోవద్దంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న దృశ్యం. ఆమంచి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

ఆమంచి
పలువురు చీరాల టిడిపి కార్యకర్తలు సోమవారం ఎన్టీఆర్ భవన్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. కిందకు దిగి రావాలని కార్యాలయ నేతలు కోరడంతో కాసేపటికి వారు వచ్చారు.

ఆమంచి
ఎన్టీఆర్ భవన్ పై నుండి కిందకు దిగి వచ్చిన కార్యకర్తలు.. ఆ తర్వాత కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ.. ఆమంచిని పార్టీలోకి చేర్చుకోవద్దని, తమ ఆవేదనను అధినేతకు చెప్పేందుకే వచ్చామని అన్నారు.

టీడీపీ
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకోవద్దంటూ హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు ఒంగోలు, చీరాలలోను టిడిపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications