బాబు భేటీ: హరికృష్ణ రాక, తలసాని డుమ్మా(పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శనివారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు, ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాక రావు, ఉమా మాధవ రెడ్డి, రమేష్ రాథోడ్, పయ్యావుల కేశవ్, యనమల, కేఈ కృష్ణమూర్తి, శిద్దా రాఘవ రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కూడా హాజరయ్యారు. అయితే, తెలంగాణ టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కాలేదు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు కావాలని, అలాగే వివిధ విభాగాలకు పూరిస్థాయి కమిటీలు ఏర్పాటు కావల్సి ఉందని చంద్రబాబు అన్నారు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

ప్రధానంగా పార్టీలో బలహీనతలు, మంత్రులకు రేటింగ్‌పై వచ్చిన వివాదం, వివిధ జిల్లాల్లో కుమ్ములాటలు అంశం కూడా పొలిట్ బ్యూరోలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి పెద్దఎత్తున తీసుకుపోవాల్సి ఉందని, ఈక్రమంలో అన్ని జిల్లాల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

ప్రభుత్వం ఏం చేసిందో ఎప్పటికపుడు జనంలోకి పోవాలని, కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి ఆలోచనలెందుకో విడమరచి ప్రజలకు చెప్పాలని, మంత్రులు పని తీరు మెరుగుపర్చుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

పార్టీ నేతలు వేగం పెంచాలని, ప్రజలతో మమేకం కావాలని, వివిధ అంశాలపై మాట్లాడినపుడు ఆచితూచి వ్యవహరించాలని, వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని సూచించారు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు సూచించారు. పోలిట్ బ్యూరో అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షంగా, తెలంగాణలో కీలకపక్షంగా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 2 నుండి సుజల స్రవంతి ప్రారంభిస్తామన్నారు. వంద రోజుల పాలనలో విద్యుత్ సమస్య చాలా వరకూ పరిష్కారం చేసినట్టు పేర్కొన్నారు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహిస్తామన్నారు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

ఏప్రిల్‌లోగా అన్ని జిల్లాల్లో కమిటీల ఎన్నికలు పూర్తి చేస్తామని వెల్లడించారు. నందిగామలో తమ పార్టీ అభ్యర్ధి ఘన విజయం సాధించారని, గతంతో పోలిస్తే ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందన్నారు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

ఇదిలావుంటే, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో వచ్చే మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

పార్టీని జాతీయ పార్టీగా చేయాల్సిన ఆవశ్యకత పైన చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీని నియమించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

జాతీయ పార్టీగా చేయాలంటే ఎలాంటి పద్ధతులు అనుసరించాలి, ఎలాంటి అర్హతలు ఉండాలి తదితర అంశాల పైన అధ్యయనం చేసే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించనున్నారు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

జాతీయ పార్టీగా ఆవిర్భవించాలంటే నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించి ఉండాలని అనుకున్నారు. ఏఐఏడీఎంకే లాంటి పార్టీలు జాతీయ పార్టీగా లేకున్నా.. తమిళనాడు, పాండిచ్చేరి రెండు రాష్ట్రాల్లోను ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

పార్టీని జాతీయ పార్టీగా మార్చకుండానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారని తెలుస్తోంది.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

రెండు రాష్ట్రాల్లోను సైకిల్ గుర్తే పార్టీకి ఉందని, ఇలాంటి పరిస్థితులో అసలు జాతీయ పార్టీగా మారాల్సిన అవసరంపై చర్చించారని తెలుస్తోంది.

టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

జాతీయ పార్టీగా మార్చాలా అనే అంశంపై ఓ కమిటీని వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, రావుల చంద్రశేఖర రెడ్డిలు ఉండే అవకాశాలున్నాయి.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

జాతీయ పార్టీగా చేయదల్చుకుంటే రానున్న రోజుల్లో కనీసం ఐదారు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా జాతీయ పార్టీగా తెలుగుదేశం ఎదగాల్సి ఉందని, అది జరగాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయాలని పలువురు సూచించారు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

వచ్చే మహానాడునే ముహూర్తంగా ఖరారు చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

 టీడీపీ పొలిట్ బ్యూరో

టీడీపీ పొలిట్ బ్యూరో

చంద్రబాబు, ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాక రావు, ఉమా మాధవ రెడ్డి, రమేష్ రాథోడ్, పయ్యావుల కేశవ్, యనమల, కేఈ కృష్ణమూర్తి, శిద్దా రాఘవ రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నందమూరి హరికృష్ణ కూడా హాజరయ్యారు. అయితే, తెలంగాణ టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+