ఓటు వేయాలి: చిన్నారితో తల్లి, వృద్ధురాలు (పిక్చర్స్)
హైదరాబాద్: తొలి విడత ఎంపిటిసి, జడ్పీటిసీ ఎన్నికల పోలింగ్ స్వల్ప సంఘటనలు మినహా ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈసారి భారీస్థాయిలో పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంచనా వేసింది.
మొత్తం 557 జడ్పీటిసిలు, 8250 ఎంపిటిసిలకు పోలింగ్ నిర్వహించగా... అనంతపురం, నెల్లూరు, మెదక్ జిల్లాల్లో మూడుచోట్ల నిలిపి వేశారు. వీటికి 11న రెండో విడతలో రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డి ప్రకటించారు.
మలివిడతలో 536 జడ్పిటిసి, 7,975 ఎంపిటిసిలకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక పోలింగ్‌కు సంబంధించి వివిధ జిల్లాల్లో వివరాలిలా ఉన్నాయి.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లితోపాటు వరంగల్ జిల్లా దుబ్బగూడెం, సోమగుండ్ల గ్రామాల్లో ఓటర్ల జాబితాలు తారుమారవగా పోలింగ్ రెండు గంటలు ఆలస్యమైంది.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
తూర్పుగోదావరి జిల్లా కోటపాడులో భోజనానికంటూ ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాన్ని మూసివేశారు. దీనిపై ఎంపిడివి పి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేయడంతో 20 నిమిషాల తర్వాత మళ్లీ తెరిచారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
చిత్రాడలో 38 ఓట్లు పోలైన తర్వాత బ్యాలెట్లు తారుమారైనట్లు ఒక ఓటరు ఫిర్యాదు చేయడంతో కొద్దిసేపు పోలింగ్ ఆగింది. తర్వాత సమయాన్ని అరగంట పొడిగించి, ఆ 38 మందితో తాజాగా ఓటు చేయించారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
కరీంనగర్ జిల్లా అడవి శ్రీరాంపూర్‌లో ఆటోలో వస్తున్న ఓటర్లను ఓ కానిస్టేబుల్ అడ్డుకోవడంతో గ్రామస్థులు ధర్నా చేయగా కొద్దిసేపు పోలింగ్ ఆగింది.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
అనంతపురం జిల్లా ఉడేగోళెంలోని ఓ కేంద్రంలో 600 ఓట్లు పోలైన తర్వాత బ్యాలెట్లు మారినట్లు అధికారులు గుర్తించి, పోలింగ్ నిలిపివేశారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
ఆదిలాబాద్ జిల్లా బోయపల్లిలో ఓట్లు గల్లంతయ్యాయన్న ఓటర్ల ఆందోళనతో గంటపాటు పోలింగ్ ఆగింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఒకచోట ఓటుముద్ర వేసే ఇంకు ముద్దగా పడటంపై ఓటర్ల గొడవవల్ల కొద్దిసేపు పోలింగ్ నిలిచింది.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ఓ బూత్‌లో ఒక వృద్ధురాలు తన ఓటు బీజేపీకి వేయాలని పోలింగ్ అధికారిని కోరగా, ఆయన కాంగ్రెస్‌కు వేశారు. దీనిపై ఆమె బంధువుల ఫిర్యాదుతో సదరు అధికారిని తక్షణం తొలగించారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
ప్రకాశం జిల్లా పొట్టి సుబ్బయ్యపాలెంలో కేంద్రం ఏర్పాటు చేయలేదంటూ గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. చిత్తూరు జిల్లా మొరంపల్లిలో బ్యాలెట్‌పై అధికారుల ముద్ర, ఓటు ముద్రను కనిపించనీయడం లేదంటూ రెండు పార్టీల ఏజెంట్లు అభ్యంతరం తెలపడంతో రెండు గంటలపాటు పోలింగ్ ఆగిపోయింది.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
కర్నూలు జిల్లా లింగాపురంలో 100 బ్యాలెట్ పేపర్లు అపహరణకు గురికాగా, అదనపు బ్యాలెట్లతో పోలింగ్ కొనసాగింది. అలాగే ముచ్చుమర్రి గ్రామంలో వెబ్ కెమెరా వైర్లను కొందరు వ్యక్తులు కత్తిరించగా పోలింగ్ గంటపాటు ఆలస్యమైంది.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
అవుకు మండలంలో పేర్లు, వయసు తప్పుగా ఉండటంతో 1200 మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఓ చోట బాలెట్లమీద గుర్తులు తారుమారై పోలింగ్ వాయిదాపడింది. అలాగే బోగోలులో 100 బ్యాలెట్ పత్రాలు గల్లంతయ్యాయి.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
ఖమ్మం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివారం ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయ. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామ సర్పంచ్‌పై స్థానిక ఎస్సై సురేష్ లాఠీచార్జ్ చేయడంతోగ్రామస్తులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎస్సై రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఎస్పీ రంగనాథ్ గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో 237ఓట్లు గల్లంతయ్యాయని గ్రామస్తులు ఆందోళన జరిపారు. బూర్గంపాడు మండలం సారపాకలో జగన్ పార్టీ నాయకుడొకరు డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కాడు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
కారేపల్లి మండలం మాదారంలో ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడటంతో ఉద్రిక్తత ఏర్పడింది. వాజేడు మండలంలో పూసురు నుంచి ఏడుచర్లపల్లిలోని పోలింగ్ కేంద్రానికి ట్రాక్టర్‌పై ఓటర్లు వస్తుండగా పోలీసులు అడ్డుకొని వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో వారంతా రెండు గంటలకు పైగా ధర్నా చేశారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
లక్ష్మీపురం గ్రామంలో కూడా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆశ్వారావుపేట మండలం రేగులకుంట గ్రామస్థులు తమకు రహదారి, తాగునీటి సౌకర్యం కల్పించలేదంటూ ఎన్నికలను బహిష్కరించారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
గుంటూరు జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగాయ. అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలున్న పల్నాడులో మధ్యాహ్నం వరకు వివిధ ఘటనలు చోటుచేసుకోవడంతో ఐజి సునీల్‌కుమార్ స్వయంగా నరసరావుపేట వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సి వచ్చింది.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, జగన్ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడటంతో అడవులదీవి ఎస్‌ఐ సిహెచ్ కోటిరెడ్డి ఓట్లు వేయడానికి వచ్చిన సామాన్య జనంపై లాఠీ ఝుళిపించారు. దీంతో స్థానికులు తిరగబడి ఆయనపై దాడి చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు లాఠీచార్జిలో నలుగురికి గాయాలయ్యాయి.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
నరసరావుపేట మండలం కేసానుపల్లిలో బయటి నుంచి వచ్చినవారు హడావుడి సృష్టించగా పోలీసులు లాఠీచార్జి చేశారు. రావిపాడులో జగన్ పార్టీ కార్యకర్తలు దొంగఓట్లు వేశారని తెదేపా ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేయగా ఇద్దరు మహిళలు సహా ముగ్గురికి గాయాలయ్యాయి.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
నకరికల్లు మండలం కండ్లకుంటలో ఓ వృద్ధురాలు ఓటు వేయడానికి రాగా, ఆమెతో పిఓ జగన్ పార్టీకి ఓటు వేయించాడని టిడిపి ఏజెంట్లు ఆరోపించడంతో పిఓను ఎన్నికల విధుల నుంచి అధికారులు తప్పించారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
ఈపూరు మండలం కొచ్చెర్లలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అక్కడి మాజీ సర్పంచ్ గోలి ఏడుకొండలుపై ఎన్నికల విధుల్లో ఉన్న దుర్గి ఎస్‌ఐ వెంకటకృష్ణ లాఠీ ఝుళిపించడంతో స్థానికులు తిరగబడ్డారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
పిట్టలవానిపాలెం మండలం అల్లురెడ్లపాలెంలో వైకాపాకు ప్రాబల్యమున్న ప్రాంతంలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయడంతో తెదేపా కార్యకర్తలు ఓటింగ్‌ను బహిష్కరించారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
బాపట్ల మండలం స్టూవర్ట్‌పురంలో హైస్కూలు వద్ద జగన్ పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థి తరపు కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో సిఐ కండె శ్రీనివాసరావు అక్కడే మకాంవేసి పరిస్థితిని సమీక్షించారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
శ్రీకాకుళం జిల్లాలో తొలి విడత పరిషత్ పోల్‌లో పాత కక్షలు బుసకొట్టాయి. లక్ష్మీపేట ఊచకోత ఘటనలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వర్గీయులను వ్యతిరేకించడమేకాకుండా, ఎస్సీలంతా ఎన్నికలను బహిష్కరించారు. జిల్లా ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్ చొరవ తీసుకుని ఫోన్ ద్వారా సర్దిచెప్పడంతో ఉదయం 11 గంటలకు అక్కడ పోలింగ్ మొదలైంది.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
కొత్తూరు మండలం మాకువరంలోని 29వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద కొంతమంది అపరచితులు ఉన్నారంటూ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి సమాచారం అందడంతో మోబైల్ టీంలు అక్కడకు చేరి ఓటర్లను తరిమారు. ఈ సందర్భంగా తిరగబడిన కొంతమంది ఓటర్లపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఐదుగురు గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
సంతకవిటి మండలం గరికిపాడు పోలింగ్ బూత్ వద్ద టిడిపి-వైకాపా పార్టీలకు చెందిన నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో ముగ్గురు గాయాలపాలయ్యారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు
గార మండలం కుమ్మరిపేటలో కూడా టిడిపి-వైకాపా వర్గాల మధ్య స్వల్పపాటి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అర్థగంటసేపు పోల్ ఆలస్యమైంది.












Click it and Unblock the Notifications