సోనియా భుజంపై కెసిఆర్, టిఆర్ఎస్ హల్‌చల్(పిక్చర్స్)

హైదరాబాద్: అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే పది లక్షలమంది సమైక్యవాదులతో చలో హైదరాబాద్ చేపట్టి మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఎపిఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. విభజనపై మంత్రుల బృందం నిర్దేశించిన నిబంధనలపై రాష్ట్ర సమైక్య పరిరక్షణ సమితి శనివారం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు.

సీమాంధ్రులకు హైదరాబాద్‌లో రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. చట్టబద్ధంగా సమావేశాన్ని నిర్వహించుకుంటే కొంతమంది తెలంగాణవాదులు ప్రాంగణంలోకి వచ్చి నినాదాలు చేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ఈ నెల 24న రెండోదశ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి అడ్డుగోలుగా కేంద్రం విభజనపై ముందుకెళ్తోందని, వాళ్లు చూపే తాయిలాలు, ప్యాకేజీలకు ఆశపడి కేంద్రమంత్రులు సీమాంధ్రులను మోసం చేస్తున్నారని తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. కేంద్రమంత్రుల బృందం నిర్దేశించిన 11 మార్గదర్శకాలను చూస్తే రాష్ట్ర విభజనకు పరిష్కారం లభించదన్నారు. రాజకీయ ప్రయోజనాలతో సాగుతున్న విభజనను అడ్డుకుని తీరుతామన్నారు.

సేవ్ ఎపి 1

సేవ్ ఎపి 1

సీట్లు, ఓట్లు కోసం కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావొద్దని, విభజన తర్వాత నక్సలైట్ల సమస్య తీవ్రమవుతుందని అశోక్ బాబు హెచ్చరించారు.

సేవ్ ఎపి 2

సేవ్ ఎపి 2

నదీ జలాల సమస్యను మండళ్లు పరిష్కరించలేవని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, లేదంటే కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సి ఉంటుందని సమైక్యవాదులు అభిప్రాయపడుతున్నారు.

సేవ్ ఎపి 3

సేవ్ ఎపి 3

రాయలసీమ, కోస్తా జిల్లాలకు ఉమ్మడి రాజధాని ప్రాంతంనుంచి కామన్ కారిడార్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, రాజ్యాంగ ఉల్లంఘనల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రక్రియను పార్లమెంటు, రాష్టప్రతి, సుప్రీం కోర్టు అంగీకరించవన్నారు.

సేవ్ ఎపి 4

సేవ్ ఎపి 4

371(డి) అధికరణను సవరించాలన్నా, తొలగించాలన్నా రాజ్యాంగ సవరణకు రెండింట మూడొంతుల మెజార్టీ అవసరమని, సీమాంధ్ర విద్యుత్ జాక్‌ల సంఘం ప్రతినిధి గణేష్ శనివారం గుడిమల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో అన్నారు.

సేవ్ ఎపి 5

సేవ్ ఎపి 5

అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన మరుక్షణం తాము మెరుపు సమ్మెకు దిగుతామని, కేంద్రాన్ని ఎలాదారికి తెచ్చుకోవాలో తమకు తెలుసునని గణేష్ చెప్పారు.

సేవ్ ఎపి 6

సేవ్ ఎపి 6

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ఉన్నత ప్రమాణాల నగరంగా తీర్చిదిద్దుకున్న తర్వాత ఇప్పుడు సీమాంధ్రులకు హక్కులేకుండా చేయడం తగదని వక్తలు అన్నారు.

సేవ్ ఎపి 7

సేవ్ ఎపి 7

అత్తాపూర్‌లోని అశోకా గార్డెన్‌లో మధ్యాహ్నం సమైక్య పరిరక్షణ వేదిక సమావేశం ప్రాంగణం వద్దకు కొంతమంది తెలంగాణవాదులు రెండుసార్లు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు.

సేవ్ ఎపి 8

సేవ్ ఎపి 8

దీంతో సమైక్యవాదులు కూడా ప్రతిఘటించి జై సమైక్యంధ్ర నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు తేరుకుని తెలంగాణవాదులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

సేవ్ ఎపి 9

సేవ్ ఎపి 9

అత్తాపూర్‌లోని అశోకా గార్డెన్‌లో మధ్యాహ్నం సమైక్య పరిరక్షణ వేదిక సమావేశం ప్రాంగణం వద్దకు కొంతమంది తెలంగాణవాదులు రెండుసార్లు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+