అక్కడే తిండి: బాబు కౌగిలి కోపం తెప్పించింది!(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్‌లు ఆదివారం కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. పొత్తు విషయాన్ని ప్రకటించారు.
దీంతో కొద్ది రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. పదేళ్ల తర్వాత టిడిపి, బిజెపి మళ్లీ చేతులు కలిపాయి. దీంతో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిలో టిడిపి చేరినట్లయింది.
1998 నుంచి 2004 వరకూ ఆరున్నరేళ్లపాటు టిడిపి ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. 2004 ఎన్నికల తర్వాత ఉభయుల మధ్యా సంబంధాలు తెగిపోయాయి. మళ్లీ ఇంతకాలానికి అవి చిగురించాయి

పొత్తు
తమ మధ్య పొత్తు కుదిరినట్లు చంద్రబాబు నాయుడు నివాసంలో ఉభయ పార్టీల నేతలు ఆదివారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించారు.

పొత్తు
పొత్తు ఒప్పందం ప్రకారం.. తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో బిజెపికి 47, ఆ ప్రాంతంలోని 17 ఎంపీ సీట్లలో ఎనిమిది కేటాయించారు. సీమాంధ్రలోని 175 అసెంబ్లీ సీట్లలో 15, పాతిక ఎంపీ సీట్లలో ఐదు ఇచ్చారు.

పొత్తు
అయితే, సీట్ల పేర్ల ప్రకటనను మాత్రం వ్యూహాత్మకంగా నిలిపివేశారు. కొన్ని సీట్లపై ఉభయల మధ్య చర్చ కొనసాగుతుండటం ఒక కారణమైతే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, సీట్ల సర్దుబాటు ప్రభావం వాటిపై పడకుండా చూడాలన్నది రెండో కారణమని చెబుతున్నారు.

పొత్తు
రెండు మూడు రోజుల్లో సీట్ల పేర్లను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. వాస్తవానికి, టిడిపి, బిజెపి మధ్య గత 15 రోజులుగా వివిధ స్థాయుల్లో పొత్తు చర్చలు కొనసాగుతూ వచ్చాయి. ఈ చర్చలు శనివారం అర్ధరాత్రి దాటాక కూడా చంద్రబాబు నివాసంలో కొనసాగాయి. చివరకు రాత్రి రెండున్నర గంటల సమయంలో వాటిని ముగించారు.

పొత్తు
అప్పటికి కూడా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతంలో ఇంకా కొన్ని సీట్లపై స్పష్టత రాలేదు. మరోసారి కూర్చుని వాటి విషయం తేల్చాలని నిర్ణయించారు.

పొత్తు
మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు వంటి జిల్లాల్లో ఈ కేటాయింపులపై ఇంకా తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. వీటిలో చివరి నిమిషంలో స్వల్పంగా కొన్ని మార్పుచేర్పులకు అవకాశం ఉందని చెబుతున్నారు.

పొత్తు
ఆదివారం తన నివాసంలో బిజెపి నేతలతో భేటీ అయిన సందర్భంగా చంద్రబాబు వారికి ఈ విషయం చెప్పారు. అంగీకారం కుదిరినచోట్ల కూడా ఒకటి రెండు చోట్ల మార్పుల అవసరం కనిపిస్తోందని, తనకు ఆ వెసులుబాటు ఇవ్వాలని ఆయన వారిని కోరారట.

పొత్తు
రెండు పార్టీలకు గెలుపు ముఖ్యమని, ఆ కోణంలో ఎక్కడైనా చిన్న చిన్న మార్పులు కావాలంటే చేసుకోవచ్చునని ఇరు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చారు.

చిచ్చు
పొత్తుపై బిజెపి శ్రేణుల్లో ముఖ్యంగా తెలంగాణ నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గాన్ని టిడిపికి కేటాయించడాన్ని నియోజకవర్గ బిజెపి నేతలు తప్పుబడుతున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ, పార్టీ నాయకుడు, పారిశ్రామికవేత్త అంజిరెడ్డిలకు నిరాశే ఎదురైంది. పటాన్‌చెరు నియోజకవర్గంను టిడిపి తీసుకోవడంపై అసంతృప్తి చెందిన నియోజకవర్గ బిజెపి కార్యకర్తలు కొందరు హైదరాబాద్ వెళ్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళనకు దిగారు. పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ప్రకాష్ జవదేకర్‌ను పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆదివారం పార్టీ కార్యాలయానికి వచ్చిన జవదేకర్‌ను పటాన్‌చెరుకు చెందిన బిజెపి నేత సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు అడ్డుకుని నిరసన తెలిపారు.

చిచ్చు
పొత్తు కుదుర్చుకోవడం పట్ల గుంటూరు జిల్లా తెనాలి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తు ఉన్నప్పటికీ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ తరపున తెనాలి నుంచి పోటీ చేయాలని తీర్మానం చేసినట్లు వారు ప్రకటించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. టిడిపితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయం బాధకరమని అన్నారు. సీమాంధ్రలో కేవలం ఐదు లోకసభ, 15 అసెంబ్లీ స్థానాలు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు.

చిచ్చు
టిడిపిలోని అసంతృప్తి జ్వాలలు రేగాయి. పొత్తులో కీలకమైన సీట్లు కోల్పోయామని బొండా ఉమ, మైనంపల్లి హన్మంత రావు వర్గీయులు చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలిపారు. బాబు నివాసం ముందే భోజనాలు చేస్తూ నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications