సిటీలో బాబు, నిమ్మగడ్డలో భార్యతో లోకేష్ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం పరిధిలో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ ఇవాళ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందంటే కారణం తానేనని, ఇక్కడ ఉన్న ప్రతి ముఖ్యమైన సంస్థ వెనుక తన కృషి ఉందన్నారు.

సింగపూర్ నిర్మాణానికి పాతికేళ్లు పట్టిందని, సింగపూర్‌ను తలపించే సైబరాబాద్‌ను పదేళ్లలో నిర్మించి చూపించానని, హైదరాబాద్‌లో ఓటడిగే హక్కు తనకే ఉందని, మరే పార్టీకి లేదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

శనివారం నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని ఆనుకొని ఉన్న మల్కాజిగిరి లోకసభ స్థానం పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

చంద్రబాబు

చంద్రబాబు

నిజాం నవాబులు చారిత్రక ప్రాధాన ్యం ఉన్న నిర్మాణాలు చేస్తే తాను ఆర్థిక ప్రాధాన్యం ఉన్న హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, బయో టెక్నాలజీ పార్క్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి తెచ్చానని చెప్పారు. ఇప్పుడు దాన్నంతా కాంగ్రెస్, తెరాస నాశనం చేశాయన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

వసూల్ రాజాలుగా మారిన పార్టీల దెబ్బకు తాను కష్టపడి హైదరాబాద్‌కు తెచ్చిన కంపెనీలు కూడా పారిపోతున్నాయని విమర్శించారు.

చంద్రబాబు

చంద్రబాబు

కేంద్రంలో ప్రధానిగా మోడీ...ఇక్కడ రెండు రాష్ట్రాల్లో టిడిపి అధికారంలోకి వస్తేనే మళ్లీ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. తెరాస వంటి పార్టీలకు ఒక్క ఓటు వేసినా నాశనమే అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆ పార్టీ మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుందని అప్రమత్తం చేశారు. తెరాస బెదిరింపులకు భయపడి ప్రాంతాన్ని వదిలిపెట్టి పోనని, కొండనయినా బద్దలు కొట్టే సత్తా తనకుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెరాసను గెలిపిస్తే హైదరాబాద్‌లో ఇళ్లు ఆక్రమించుకోవచ్చునని కొందరు ప్రచారం చేస్తున్నారని, ఇది ఎక్కడైనా సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రతి తెలుగువాడికి రక్షణగా టిడిపి ఉంటుందని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

టిడిపియే దమ్మున్న పార్టీ అని, చెప్పిన ప్రతిదీ చేసి చూపిస్తుందని, తాను ఇక్కడే ఉంటానని, బిసిని ముఖ్యమంత్రిని చేసి చూపిస్తానని, పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన తర్వాతే కదులుతానన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో సైకిల్ గాలి వస్తోందని, ఇక తమకు తిరుగులేదని ధీమా వ్యక్తం చేశారు. రెండు ప్రాంతాల్లోనూ ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

డొక్కు కారు, మొండి చెయ్యి చిత్తు చిత్తేనని వ్యాఖ్యానించారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీస్ అధికారులు కూడా దొంగల పార్టీలో చేరి పోటీ చేస్తున్నారని.. దినేశ్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

మంచి పాలన కావాలని ఊరికే అనుకోవడం కాదని, సెలవుల్లో ఊర్లకు వెళ్లకుండా ఇక్కడే ఉండి ఓటు వేసిన తర్వాతే వెళ్లాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని, మహిళల ఆశాదీపాన్ని ఆర్పేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రహిత దేశం కోసం కృషి చేస్తున్నామని, గతంలోనూ మూడు పర్యాయాలు టిడిపి కారణంగానే కాంగ్రేసేతర పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వచ్చాయన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

టిడిపి అధికారంలోకి వస్తే.. పేదలకు లక్షన్నరతో ఉచిత గృహాలను నిర్మించి ఇస్తామని, రెండు రూపాయలకు ఇరవై లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామని, పరిశ్రమల్లో పని చేసే వారికి, కార్మికులకు ఎన్టీఆర్ అన్న పథకం కింద 5 రూపాయలకే భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని, వారికి సెల్‌ఫోన్‌లు ఇచ్చి, కాల్ చేసిన పదినిమిషాల్లోనే రక్షణ కల్పించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు రెండు వేల రూపాయలు చొప్పున భృతి చెల్లిస్తామని, వృద్ధులకు, వికలాంగులకు నెలకు 1000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తామని, డ్వాక్రా అడపడుచులు, అన్నదాతల రుణం మాఫీ చేస్తామని ప్రకటించారు.

నారా లోకేష్

నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన శనివారం నిప్పులు చెరిగారు.

నారా లోకేష్

నారా లోకేష్

నిమ్మకూరులో యువ ప్రభంజన యాత్ర ప్రారంభించిన లోకేష్ పలుచోట్ల ప్రసంగించారు. ఢిల్లీ తలవంచే రోజు రాబోతోందని, రాబోయే ఎన్నికల్లో సీమాంధ్రలో 25కు 25 సీట్లు ఇవ్వాలని, 30 రోజుల్లో మనమేమిటో చూపిద్దామన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవశాలి కావాలా? పీకల్లోతు అవినీతి రొచ్చులో కూరుకుపోయిన నేత కావాలా? తేల్చుకోవాలన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

రోడ్ షో పొడవునా చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ముందుకు సాగారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు సంధిస్తూ.. తన తండ్రి చంద్రబాబు పాలనలో సంక్షేమాన్ని గుర్తు చేస్తూ.. మేనిఫెస్టో అమలుకు భరోసా ఇస్తూ... తొలిరోజు రోడ్ షోలో ప్రజలను ఆకట్టుకున్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

గుడివాడ నెహ్రూచౌక్‌లో, విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించిన లోకేష్... జగన్‌పై ఘాటైన విమర్శలు చేశారు. నాలుగే నాలుగు సంతకాలతో ప్రజల జీవితాలు మార్చేస్తానంటున్న యువ నేత.. మన కోసం నాలుగు సంతకాలు పెట్టి మిగతా సంతకాలన్నీ కుటుంబం కోసం, అవినీతి మిత్రుల కోసం పెడతారని ఎద్దేవా చేశారు.

నారా లోకేష్

నారా లోకేష్

టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో అమలుపై భరోసా ఇచ్చారు. 63 ఏళ్ల వయస్సులో చంద్రబాబు 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ఆచరణ సాధ్యమయ్యే, ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడే మేనిఫెస్టోను రూపొందించారన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

రైతాంగం చితికిపోతుంటే ఆత్మహత్యలు వద్దని, రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, టిడిపి మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని కార్యాచరణ దిశగా తీసుకెళ్తామన్నారు. యువత ఉద్యోగ, ఉపాధికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. యాత్రలో లోకేష్‌తో పాటు బ్రాహ్మణి పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+