కాపుల్ని దువ్వుతున్న బాబు, పదేపదే పవన్ (పిక్చర్స్)
రాజమండ్రి/ఏలూరు: సీమాంధ్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు ఒకటి, కాపులకు ఒకటి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రకటించారు. కాపులు జగన్ పార్టీకి మద్దతిస్తారనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పడం గమనార్హం.
మోడీది, తనదీ అభివృద్ధి జట్టు అయితే, జగన్, సోనియాలది అక్రమాల జట్టు అన్నారు. తాను, మోడీ లీడర్లం అయితే, జగన్ జైలు పక్షి అని ఎద్దేవా చేశారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామంటే.. ఎలా చేస్తారంటూ జగన్ ప్రశ్నించడం చూస్తే రైతులపట్ల ఆయనకు ఉన్న తేలికభావం అర్థమవుతుందన్నారు. పొరపాటున జగన్ పార్టీకి ఓటేస్తే రౌడీల పాలన వస్తుందని హెచ్చరించారు.

చంద్రబాబు
శనివారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, రంపచోడవరం గిరిజన తండాలు, సామర్లకోట, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, శృంగవృక్షం, ఆచంట, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు ఎన్నికల సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

చంద్రబాబు
అల్లూరి లాంటి వారిని గుర్తుంచుకోవాలా లేక సైకో జగన్‌ను గుర్తుంచుకోవాలా అని ప్రశ్నించారు. సాధారణంగా అందరికి క్లాస్‌మేట్స్, బెంచ్‌మేట్స్, రూమ్ మేట్స్ ఉంటారని, కానీ జగన్ పార్టీకి జైల్‌మేట్స్, సెల్‌మేట్స్, ఏ1, ఏ2 ముద్దాయిలు మాత్రమే సన్నిహితులని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు
జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని విమర్శించారు. ఏది విశ్వసనీయత? జైలుకెళ్లడమా.. దేశాన్ని కొల్లగొట్టడమా? తండ్రితో కలసి దోచుకోవడమా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ పది తరాలకు సరిపడా దోచుకున్నారన్నారు.

చంద్రబాబు
ఆ సొమ్ముతోనే పత్రిక, టీవీ పెట్టారని, జగన్ పత్రిక.. అదో పనికిమాలిన పేపర్ అన్నారు. తప్పు చేసిన వాడు ఏదో ఒక రోజు పశ్చాత్తాప పడతాడని, దొంగలు, హత్యలు చేసిన వాళ్లు కూడా బాధపడతారని, కానీ జగన్‌లో బాధగానీ, పశ్చాత్తాపం గానీ లేవన్నారు.

చంద్రబాబు
కడపలో జగన్ బంధువు ఏకంగా 40 కోట్ల హవాలా సొమ్మును రప్పించుకున్నారని, నేర చరితతో కూడిన ఈ డబ్బుతో ఓట్లు కొనాలనుకుంటున్నారని, సీమాంధ్రను పునాదులతో నిర్మించుకోవాలి, మోడీ ప్రధానిగా ఉంటే దీనికి అవసరమైన నిధులు అందిస్తారని చెప్పారు.

చంద్రబాబు
దేశాన్ని అధోగతి పాలుచేసిన తెల్లదొరసాని సోనియా తెలుగు ప్రజలతో నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు వేలు ఇస్తున్నారని ఓటుకు అమ్ముడుపోతే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు.

చంద్రబాబు
కెసిఆర్, జగన్ ఒకరినొకరు తిట్టుకోరని, వారిద్దరూ తోడు దొంగలన్నారు. బయ్యారంలో లక్షా 40 వేల ఎకరాలను కాజేసేందుకు ప్రయత్నించిన నువ్వా నన్ను విమర్శించేది అంటూ జగన్ సోదరి షర్మిలకు చురకలు అంటించారు.

చంద్రబాబు
దాదాపు అన్ని సభల్లోనూ పవన్ కళ్యాణ్‌ను ఆయన గుర్తు చేసుకున్నారు. పవన్ నాకు బంధువు కాదు, స్నేహితుడు అంతకంటే కాదు, కాని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని రూపుమాపేందుకే బయటకు వచ్చారని, మోడీకి, తనకు మద్దతు ఇచ్చారని, దేశ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఈసారి ఎన్నికల ప్రచారంలోకి వచ్చారన్నారు.












Click it and Unblock the Notifications