సంసారం విడిపోయినట్లుగా: బాబు ఆవేదన (పిక్చర్స్)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 2004-2014 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేసిందని.. దానిని గాడిలో పెట్టడంతో పాటు విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసి దేశంలోనే మోడల్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించారు.

సహేతుకమైన ధరలకే నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తానన్నారు. విద్యుత్ వాడకం అధికంగా ఉంటే నాగరికత.. ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ సమక్షంలో చంద్రబాబు.. విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

రాష్ట్రంలో ప్రధాన రంగాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు వీలుగా శ్వేత పత్రాలు విడుదల చేస్తామని తాము చెప్పామని, అందులో భాగంగా అత్యంత ప్రాధాన్యమైన విద్యుత్ రంగానికి సంబంధించి తొలి శ్వేత పత్రం విడుదల చేస్తున్నామన్నారు. దీనిని వెబ్‌సైట్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సరఫరా పరిస్థితి చూస్తుంటే .. చాలా అధ్వానంగా ఉందని చంద్రబాబు అన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో ఆ దేవుడికే ఎరుకని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు గృహాలకు 24 గంటలూ విద్యుత్‌ను ఇచ్చేవాళ్లమన్నారు. ఇప్పుడు పట్టణాల్లో 4 గంటలు, మండలాల్లో 6 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటలు విద్యుత్ కోతలు అమలవుతున్నాయని చెప్పారు. పరిశ్రమలు 40% మించి విద్యుత్‌ను వినియోగించుకునేందుకు వీల్లేదని హుకుం జారీ చేశారన్నారు. చంద్రబాబు లేక్ వ్యూ గెస్టు హవుస్‌లో అధికారులతో....

చంద్రబాబు

చంద్రబాబు

ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తాను కేసీఆర్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమని, తనకు ఎలాంటి భేషజాలూ లేవని, పైగా .. కేసీఆర్ తనకు తెలియని వ్యక్తి కాదని, ఆయనతో పరిచయం ఉందని, ఇరు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్‌తో సమావేశమయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం లేక్ వ్యూ గెస్టు హవుస్‌లో అధికారులతో భేటీ అయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం లేక్ వ్యూ గెస్టు హవుస్‌లో అధికారులతో భేటీ అయ్యారు.

24 గంటలూ విద్యుత్

24 గంటలూ విద్యుత్

త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని చంద్రబాబు చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న ఏడు గంటల విద్యుత్‌ను క్రమంగా తొమ్మిది గంటలకు పెంచుతామని అన్నారు.

విభజన

విభజన

రాష్ట్ర విభజన జరిగి నెల రోజులయిందని, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 24 రోజులయిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంకా సరిగ్గా కార్యాలయాల కేటాయింపులు జరగలేదన్నారు. అధికారులు, ఉద్యోగుల పంపణీ కూడా పూర్తికాలేదని, క్యాడర్ స్థాయి అధికారుల పంపిణీకి ఇంకా రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు.

ముందే చెప్పా

ముందే చెప్పా

తాను రాష్ట్ర విభజన సమయంలోనే సమన్యాయం జరగాలని కోరుతూ వచ్చానని, రాష్ట్ర విభజన వల్ల ఇరు రాష్ట్రాల్లోనూ విద్యుత్ సమస్యలు తలెత్తుతాయని చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధి జరగాలని కాంక్షిస్తున్నానన్నారు. రాష్ట్రం అంతా సమాన స్థాయిలో వృద్ధి చెందాలని, అన్ని ప్రాంతాలకూ సమాన స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను పని చేస్తున్నానన్నారు.

సంసారం విడిపోయినట్లుగా..

సంసారం విడిపోయినట్లుగా..

ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తేవి కాదని, ఇప్పుడు సంసారాలు విడిపోయినట్లుగా ఉందని, వంటకు కావాల్సిన పొయ్యి కూడా విభజించుకునే పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తాను చెబుతూ వచ్చానని, ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులు, సహజ వనరులను ఉపయోగించుకుని అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తున్నామని చెప్పారు.

సంస్కరణలు తెచ్చా

సంస్కరణలు తెచ్చా

1998లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ రంగంలో సంస్కరణలు తానే తెచ్చానని చంద్రబాబు చెప్పారు. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కోతోపాటు నాలుగు డిస్కంలను ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఇంధన రంగంలో సంస్కరణలు తీసుకువచ్చానని, ఆనాడెవరూ ఈ సంస్కరణలు అమలు చేసేందుకు ముందుకు రాలేదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu on Wednesday avoided giving a direct reply on whether consumers in the state would be spared from a hike in power tariff against the backdrop of power distribution companies seeking a revision with the AP Electricity Regulatory Commission.
Please Wait while comments are loading...