తెలంగాణలో బాబు సవాల్: ఈలలు, కేరింత (పిక్చర్స్)

హైదరాబాద్: పార్టీ నుండి ఒక నాయకుడు వెళ్తే వంద మంది నాయకులను తయారు చేస్తానని టీడీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పార్టీనీ వీడిన నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా ఉండేందుకు వీలుగా చంద్రబాబు మంగళవారం వారితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ మనమే అధికారంలోకి వస్తామన్నారు. చంద్రబాబు అలా చెప్పగానే కార్యకర్తలు సంతోషంతో ఈలలు వేశారు, కరతాళధ్వనులు చేశారు. ఎవరో ఒక నాయకుడు పార్టీ ఫిరాయిస్తే అధైర్యపడవద్దని, ఒకరు వెళితే వంద మంది నాయకులను తయారు చేస్తానననగా కార్యకర్తలు కేరింతలు కొట్టారు.

పదవి లేకున్నా పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలు చాలామంది మన పార్టీలో ఉన్నారని, కార్యకర్తలకు అండగా ఉండాల్సిన సమయంలో మోసం చేశారన్నారు. తెలంగాణలోని ప్రతి కార్యకర్తకూ తాను అండగా ఉంటానని తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో కొంత సేపు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. భవిష్యత్తు మీదేనని బాబు వారికి చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

తాను ఎక్కడికీ వెళ్లనని, ఇక్కడే ఉంటానని, 2019లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని, ఖమ్మం జిల్లాలో పది సీట్లు గెలిపించే బాధ్యత తనదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కేంద్రం నుండి వచ్చే పదవులు తెలంగాణకే ఇస్తానని చెప్పారు. ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును హైదరాబాదులో కలిశారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు అధినేతను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

పార్టీ నుండి ఒక్క నాయకుడు వెళ్లిపోతే వందమందిని తయారు చేసే శక్తి తనకు ఉందని చెప్పారు. తాను ఎక్కడికి పోనని, ఇక్కడే ఉంటానని అన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

కార్యకర్తలకు, నాయకులకు ఇబ్బంది వస్తే తాను ముందు ఉంటానని చెప్పారు. ఎవరినీ వదిలి పెట్టే సమస్య లేదన్నారు. ఖమ్మం వస్తానని, పది సీట్లు గెలిపించే బాధ్యత తనదే అన్నారు. 2019లో అధికారం తమదే అన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

గెలిచిన రెండు నెలలకే పార్టీని వీడుతున్నారన్నారు. ముప్పయ్యేళ్ల పాటు పార్టీలో ఉండి, పార్టీలో ఎంతో ఎదిగి, ఎన్నో ఉన్నత స్థానాలను దక్కించుకున్న నేతలు ఇప్పుడు పార్టీని, కార్యకర్తలను మోసం చేసి వెళ్లడమే తనకు బాధ అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని, దీనిని ఎవరూ దెబ్బతీయలేరన్నారు. పార్టీకి రెండు ప్రాంతాలు రెండు కళ్లు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలను కొనుక్కుంటోందని ఆరోపించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

కేంద్రం కేటాయించే పదవులు అన్నింటిని తెలంగాణ టీడీపీ నేతలకే ఇస్తామని చంద్రబాబు చెప్పారు. తెరాసకు టీడీపీ నేతలు ఎవరు కూడా భయపడవద్దన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు


కార్యకర్తలు తనకు ప్రాణంతో సమానమని, వారితో కాళ్లు మొక్కినా రుణం తీరదన్నారు. ఆంధ్రాలో కలిసే ప్రాంతాల రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు


ఆంధ్రాలో మిగులు విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికే కేటాయిస్తామన్నారు. తుమ్మల వంటి నేతలు ఊసరవెల్లి రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. తెరాస అప్పుడే వెలవెల పోయే పరిస్థితి వచ్చిందన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

పార్టీ నుండి ఒక నాయకుడు వెళ్తే వంద మంది నాయకులను తయారు చేస్తానని టీడీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పార్టీనీ వీడిన నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా ఉండేందుకు వీలుగా చంద్రబాబు మంగళవారం వారితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ మనమే అధికారంలోకి వస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+