అరుణతో పాల్వాయి, నరకమని రెచ్చిపోయారు(పిక్చర్స్)
హైదరాబాద్: ఐదుగురు కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యులు బుధవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెసు పార్టీ నేతలు మండిపడుతుండగా... తెరాసలో చేరిన ఎమ్మెల్సీలు సమర్థించుకుంటున్నారు.
కాంగ్రెసు పార్టీ నుండి ఎమ్మెల్సీలుగా అయిన వారు తెరాసలో చేరడం బాధాకరమని, ఆమోస్ వంటి నేతలు కూడా కారు ఎక్కడం ఎంత వరకు సమంజసమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
దానికి ధీటుగానే తెరాసలో చేరిన ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. గాంధీ భవనంను నరకంగా మార్చారని వారు విమర్శలు గుప్పించారు.

పాల్వాయి, డీకే అరుణ
హైదరాబాదులోని సీఎల్పీ కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెసు పార్టీ నాయకులు డీకే అరుణ, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిలు మాట్లాడుకుంటున్న దృశ్యం.

దానం
హైదరాబాదులోని సీఎల్పీ కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెసు పార్టీ నాయకులు దానం నాగేందర్, గీతా రెడ్డిలు మాట్లాడుతూ... తెరాసలో చేరిన ఎమ్మెల్యేలను తప్పు పట్టారు.

జానా రెడ్డి
హైదరాబాదులోని సీఎల్పీ కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెసు పార్టీ నాయకులు దానం నాగేందర్, సుధీర్ రెడ్డిలతో తెలంగాణ సీఎల్పీ నేత జానా రెడ్డి.

పాల్వాయి
హైదరాబాదులోని సీఎల్పీ కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెసు పార్టీ నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... ఏం తెలియని వాళ్లు గాంధీ భవన్లో ఉంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. కాంగ్రెస్ పార్టీ ఓటమిని, తెరాసలోకి ఎమ్మెల్సీల చేరికను ఉద్దేశించి అన్నారు. ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపులో డబ్బులు చేతులు మారటం వల్లనే ఓడిపోయామన్నారు.

స్వామిగౌడ్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో గురువారం కొత్తగా చేరిన శాసన మండలి సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న స్వామి గౌడ్.

తెరాస
కాంగ్రెసు పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. గాంధీ భవన్‌ను నరకంలా మార్చారని దుయ్యబట్టారు.

స్వామి గౌడ్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో గురువారం కొత్తగా చేరిన శాసన మండలి సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న స్వామి గౌడ్.












Click it and Unblock the Notifications