వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యే చెవుల్లో కిరణ్ క్యాలీఫ్లవర్! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశ పెట్టినప్పటి నుండి హాట్ హాట్‌గా కనిపించిన అసెంబ్లీ సమావేశాలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అసెంబ్లీ నిరసవధిక వాయిదాపై తెరాస, బిజెపి, టిటిడిపి నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీని ఏకపక్షంగా వాయిదా వేశారని సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేయగా, తెలంగాణ టిడిపి నేతలు పోడియం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.

కాగా, మీడియా పాయింటు వద్ద వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతల మాటలు హీటెక్కించాయి. కిరణ్ మన చెవుల్లో క్యాలీఫ్లవర్ పెడుతున్నారంటూ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.

దూళిపాళ్ల

దూళిపాళ్ల

సీమాంధ్ర ప్రాంతానికి ఎలాంటి సమన్యాయం లేకుండా తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారని, దానిని అడ్డుకుంటామని చెబుతున్న సీమాంధ్ర టిడిపి నేతలు.

జై తెలంగాణ

జై తెలంగాణ

అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద జై తెలంగాణ నినాదాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు.

ఎర్రబెల్లి, హరీష్

ఎర్రబెల్లి, హరీష్

అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు హరీష్ రావు.

ఈటెల, హరీష్

ఈటెల, హరీష్

తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకోవద్దని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరుతున్న తెలంగాణ ప్రాంత తెరాస, సిపిఐ, బిజెపి శాసన సభ్యులు.

యెండల

యెండల

తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకోవద్దని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరుతున్న తెలంగాణ ప్రాంత తెరాస, సిపిఐ, బిజెపి శాసన సభ్యులు.

శంకర రావు

శంకర రావు

అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ కంటోన్మెంట్ శాసన సభ్యులు శంకర రావు దృశ్యం.

జెసి దివాకర్ రెడ్డి

జెసి దివాకర్ రెడ్డి

కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి గురువారం మరోసారి నిప్పులు చెరిగారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన రాయలసీమ ప్రతినిధులం రాష్ట్రపతిని కలిసి తమ గోడు వెల్లబోసుకుంటామన్నారు.

జెసి

జెసి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు సమన్యాయం అన్నప్పటికీ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్నారని, దానికి తాను అభినందిస్తున్నానని జెసి అన్నారు.

దివాకర్ రెడ్డి

దివాకర్ రెడ్డి

కాంగ్రెసు పార్టీలో ఉన్న స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదని, అధినాయకత్వం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని, తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ఇంతటితో ముగించి, సమైక్యం కోసం తీర్మానం చేయాలని పట్టుబడతామని జెసి చెప్పారు.

జెసి అండ్ గాలి

జెసి అండ్ గాలి

అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డితో సీమాంధ్ర టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు.

శోభా నాగి రెడ్డి

శోభా నాగి రెడ్డి

అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు శోభా నాగి రెడ్డి, పక్కన ఇతర ఎమ్మెల్యేలు.

టిటిడిపి

టిటిడిపి

అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద కుర్చీలో కూర్చున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు.

జగన్ పార్టీ

జగన్ పార్టీ

అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్టూనును ప్రదర్శిస్తూ.. క్యాలీఫవర్‌ను చెవిలో పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు.

దేవినేని

దేవినేని

అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు దేవినేని ఉమామహేశ్వర రావు తదితరులు.

నాగం

నాగం

అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి.

నాగం, టిడిపి నేతలు

నాగం, టిడిపి నేతలు

అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి. పక్కన టిడిపి నేతలు.

English summary
Discussion on the Telangana Bill, could not be taken up in Assembly on Thursday as MLAs from Seemandhra opposed to the move and did not allow the proceedings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X