హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాధితుల కోసం రాజయ్య వైద్యుడి అవతారం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్య వైద్యుడి అవతారమెత్తారు. స్వతహాగా వైద్యుడైన ఆయన స్వయంగా రోగులను పరీక్షించారు.

యాదగిరిగుట్ట ఘాట్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన 11మంది క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆదివారం గాంధీ ఆస్ప త్రికి వచ్చిన ఆయన వార్డుల్లో తిరుగుతూ సమస్యలు అడిగి తెల్సుకున్నారు.

యాదగిరి గుట్ట ప్రమాద క్షతగాత్రులకు అందుతోన్న వైద్య సేవలను అడిగి తెల్సుకున్నారు. వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని రాజయ్య పేర్కొన్నారు.

రాజయ్య

రాజయ్య

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకోసం నిధులూ కేటాయించామని రాజయ్య అన్నారు.

రాజయ్య

రాజయ్య

ఆరోగ్యశ్రీ రోగుల వైద్యాన్నికయ్యే పూర్తి ఖర్చు సర్కారు బాధ్యత అని, మందులు, ఇతరత్రా ఖర్చుల పేరిట డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని రాజయ్య చెప్పారు.

 రాజయ్య

రాజయ్య

16 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులిస్తున్నామని, వారి కోసం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి రాజయ్య చెప్పారు.

రాజయ్య

రాజయ్య

పెయిడ్‌ రూమ్స్‌లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని, వైద్యులకు పత్యేక వేతనం ఇస్తామని ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు.

రాజయ్య

రాజయ్య

ఏరియా ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులల్లో ఆధునిక వైద్య పరికరాలు అందించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు చెప్పారు.

రాజయ్య

రాజయ్య

అత్యవసర వైద్య సేవలకు నగరానికి రాకుండా, జిల్లా స్థాయిలోనే సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.

 రాజయ్య

రాజయ్య

నాలుగు నెలలుగా వేతనాలు రావడం లేదని ఆస్పత్రిలో పనిచేసే సెక్యురిటీ గార్డులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురాగా.. ప్రతినెలా జీతాలు చెల్లించేలా చూస్తానని హామీ ఇచ్చారు.

English summary
Photos: Dy.CM Rajaiah Visited Gandhi Hospital and Inspecting who InjuredRoad Accident at Bhuvanagiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X