కేసీఆర్! ఏపీకి సాయం, పుల్ల పెట్టకు: ఎర్రబెల్లి (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విభజన నాడే కేంద్రం కొన్ని విధివిధానాలు రూపొందించిందని, వాటికి అనుగుణంగా నడుచుకోవడం నేర్చుకోవాలని తెలంగాణ కేసీఆర్‌కు హితవు పలికారు.

అన్నదమ్ముల్లా విడిపోదామని చెప్పింది మాటల వరకేనా? చేతల్లో కాదా? అని ప్రశ్నించారు. ఇద్దరన్నదమ్ముల్లో ఒకరు కష్టపడి పైకి వస్తానంటుంటే సాయం చేయాల్సింది పోయి ఈ పుల్లలు పెట్టుడేమిటని నిలదీశారు. యుద్ధం చేయాలనుకుంటే ఎదురుబొదురుగా నిలబడి పోరాడాలి తప్ప, కుట్రలు, కుయుక్తులతో కాదన్నారు.

విభజన ఏ రీతిన, ఏ ఒప్పందాల ప్రకారం జరిగిందో కేసీఆర్‌కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు అన్నీ ఒప్పుకుని ఇప్పుడు తప్పుడు కూతలు కూయడం సరికాదన్నారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం చేతనైతే చేయూతనిద్దాం, అంతే కానీ, వాస్తవాలు విస్మరించి తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. పోలవరం ఆర్డినెన్స్, గవర్నర్‌కు అధికారాల విషయంలో నాడు కేసీఆర్ మాట్లాడకుండా ఇప్పుడు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఆ రెండింటి పాపం తెరాసదే అన్నారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

కేసీఆర్ అవాకులు చవాకులు తెలంగాణ ప్రజలకు అర్థం అయితే ఇక టీఆర్ఎస్ పని ముగిసినట్టేనని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అంతకుముందు అన్నారు. టీడీపీ, బీజేపీలపై బురదజల్లి రాజకీయ లబ్ది పొందుదామని చూస్తున్నారని, అది తప్ప కేసీఆర్ సాధించగలిగేది ఇంకేమీ లేదన్నారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

మెట్రో రైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, కెసిఆర్‌ను హైదరాబాద్ ప్రజలు త్వరలోనే తరిమికొడతారని ఎర్రబెల్లి అన్నారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం, హైదరాబాద్‌పై గవర్నర్ అధికారానికి సంబంధించిన విషయాలు కె చంద్రశేఖర్ రావుకు ముందే తెలుసని, అయినా కూడా ఆయన ఆ రోజు పార్లమెంటులో కెసిఆర్ నోరు మెదపలేదని ఎర్రబెల్లి ఆరోపించారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ ఏ విషయంపైనా స్పష్టత ఇవ్వలేదని ఎర్రబెల్లి అన్నారు. కేజీ నుంచి నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీ ఏమైందని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

గవర్నర్ ప్రత్యేక అధికారాలపై కెసిఆర్ రాజకీయ చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. పోలవరం ముంపు గ్రామాలు, గవర్నర్‌కు అధికారాలు యూపిఏ తీసుకున్న నిర్ణయాలేనని చెప్పారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో సామాన్యులు లక్ష్యంగానే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. పెద్దవాళ్లకు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం కల్పించారని అన్నారు. గతంలో గురుకుల్ ట్రస్ట్ నిర్మాణాల కూల్చివేతను ప్రస్తుత టిఆర్ఎస్ ఎంపి కవిత అడ్డుకున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+