వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదం, ఆందోళన (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: విశాఖ జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని గ్లోకెమ్ ఇండస్ట్రీస్ లిమిటెండ్‌లో శనివార అమ్మోనియం లిక్విడ్ గ్యాస్ పైపులైన్ వద్ద బారీ పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో పదిమంది ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి గాజువాకలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కంపెనీలోని సిల్లింగ్ ప్లాంటులో గడ్డ గట్టిన మిథిలిన్ సాల్వన్సీని చల్లబర్చడానికి వీలుగా అమ్మోనియం గ్యాస్ లిక్విడ్‌ను మరో ప్రదేశానికి పంపుతుండగా ఉదయం పైపులైనులో ఒత్తిడి పెరిగి పెద్ద శబ్దంతో పేలిపోయింది.

గ్లోకెమ్

గ్లోకెమ్

ఫార్మాసిటీలోని గ్లోకెమ్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకోవడం ఇది మూడవసారి. గత ఏడాది మే 30న జరిగిన ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

గ్లోకెమ్

గ్లోకెమ్

అప్పట్లో జరిగిన ప్రమాదంలో కంపెనీకి సుమారు రూ.60 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. గోడౌన్‌లో నిల్వ వుంచిన సుమారు 60 రకాల ముడి పదార్థాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో కంపెనీలో సుమారు రెండు నెలల వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు

 గ్లోకెమ్

గ్లోకెమ్

అనంతరం యాజమాన్యం కాలిపోయిన బ్లాక్‌లను తొలగించి వాటి స్థానంలో కొత్త బ్లాక్‌లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యింది. ప్రస్తుతం ఆ పనులు తుది దశకు చేరుకున్నాయి.

 గ్లోకెమ్

గ్లోకెమ్

ఓ పక్క పనులు జరుగుతుండగానే మరోపక్క ప్రొడక్షన్ ప్రారంభించడంపై ఇక్కడ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించకుండా యాజమాన్యం కార్మికుల ప్రాణాలతో చలగాటమాడుతుందని స్థానికులు మండిపడుతున్నారు.

 గ్లోకెమ్

గ్లోకెమ్

నిర్మాణ పనులు పూర్తి కాకుండానే ప్రొడక్షన్‌కు ఎలా అనుమతులు ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పరిసర గ్రామాల ప్రజలు అంటున్నారు.

 గ్లోకెమ్

గ్లోకెమ్

ఫార్మాసిటీలో ప్రొడక్షన్ ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. తరుచూ ప్రమాదాలు జరుగుతున్న కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్పట్లో కంపెనీపై పలు నిబంధనలను జారీ చేసింది.

 గ్లోకెమ్

గ్లోకెమ్

ఫార్మాసిటీలోని గ్లోకెమ్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకోవడం ఇది మూడవసారి. గత ఏడాది మే 30న జరిగిన ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

 గ్లోకెమ్

గ్లోకెమ్

అప్పట్లో జరిగిన ప్రమాదంలో కంపెనీకి సుమారు రూ.60 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. గోడౌన్‌లో నిల్వ వుంచిన సుమారు 60 రకాల ముడి పదార్థాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో కంపెనీలో సుమారు రెండు నెలల వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు.

 గ్లోకెమ్

గ్లోకెమ్

అనంతరం యాజమాన్యం కాలిపోయిన బ్లాక్‌లను తొలగించి వాటి స్థానంలో కొత్త బ్లాక్‌లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యింది. ప్రస్తుతం ఆ పనులు తుది దశకు చేరుకున్నాయి.

 గ్లోకెమ్

గ్లోకెమ్

ఓ పక్క పనులు జరుగుతుండగానే మరోపక్క ప్రొడక్షన్ ప్రారంభించడంపై ఇక్కడ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించకుండా యాజమాన్యం కార్మికుల ప్రాణాలతో చలగాటమాడుతుందని స్థానికులు మండిపడుతున్నారు.

 గ్లోకెమ్

గ్లోకెమ్

నిర్మాణ పనులు పూర్తి కాకుండానే ప్రొడక్షన్‌కు ఎలా అనుమతులు ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పరిసర గ్రామాల ప్రజలు అంటున్నారు.

 గ్లోకెమ్

గ్లోకెమ్

ఫార్మాసిటీలో ప్రొడక్షన్ ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. తరుచూ ప్రమాదాలు జరుగుతున్న కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్పట్లో కంపెనీపై పలు నిబంధనలను జారీ చేసింది.

English summary
Photos of Glochem accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X