హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిలో షర్మిల 'కీ': సోనియా ఫ్లెక్సీ, సుష్మా రాక (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీలు ఇక ప్రజల్లోకి వెళ్లి తమ పార్టీలు చేసిన కృషిని చెప్పాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే హైదరాబాదుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెసు, బిజెపి ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి.

ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణను తామే ఇచ్చామని తెలంగాణ ప్రాంత నేతలు చెబుతుంటే, ఇచ్చిన మాట ప్రకారం తాము తెలంగాణ బిల్లును సమర్థించామని, తాము బిల్లుకు సహకరించకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని బిజెపి చెబుతోంది. తెలంగాణ పట్ల బిజెపి చిత్తశుద్ధి బిల్లుకు మద్దతివ్వడంతో తెలిసిందంటున్నారు.

మరోవైపు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హితబోధ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పునర్ నిర్మాణం టిడిపితోనే సాధ్యమని, దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు విలీనమా లేక పొత్తా అనే విషయమై ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ షర్మిలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించనుందని ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ ప్రజల అరవయ్యేళ్ల కలను నెరవేర్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు అంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు హైదరాబాదులో భారీగా హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.

సోనియా, రాహుల్

సోనియా, రాహుల్

తెలంగాణ ప్రజల అరవై వసంతాల కలను నెరవేర్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు అంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు హైదరాబాదులో భారీగా హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

తెలంగాణ ఏర్పాటు బిజెపి వల్లే సాధ్యమైందని ఆ పార్టీ ప్రజలకు చెప్పాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాదులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, సుష్మా స్వరాజ్‌ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. అలాగే అమరవీరుల కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణలో అభివృద్ధి తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైందని, రాష్ట్రం ఏర్పడ్డాక పునర్ నిర్మాణం కూడా టిడిపితోనే సాధ్యమని ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు తెలంగాణ ప్రాంత నేతలకు సూచించారు.

షర్మిల

షర్మిల

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి విభజన అనంతరం తెలంగాణ ప్రాంత పార్టీ బాధ్యతలను సోదరి షర్మిలకు అప్పగించే అవకాశాలున్నాయి.

English summary
Big hoarding put across the Hyderabad city by Congress cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X