జగ్గారెడ్డి లొంగుబాటు, హరీష్‌కి రోజు గడవదని(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పైన భారతీయ జనతా పార్టీ బీజేపీ మెదక్ లోకసభ అభ్యర్థి జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటమి భయంతోనే తెరాస తన పైన అభాండాలు వేస్తోందన్నారు. వ్యక్తిగతంగా కాకుండా.. అభివృద్ధిలో పోటీ పడదామని ఆయన సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి టిక్కెట్లు అమ్ముకుందన్నారు. తన వద్ద డబ్బుంటే తెరాస టిక్కెటే కొనుక్కునే వాణ్ణి అన్నారు. కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉందంటే అది బీజేపీ బిక్షే అన్నారు.
లొంగిపోయిన జగ్గారెడ్డి
మెదక్ జిల్లా నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి సోమవారం సిద్దిపేట కోర్టులో సరెండర్ అయ్యారు. 2010 ఉప ఎన్నికల్లో రెచ్చగొట్టేలా మాట్లాడారని జగ్గారెడ్డి పైన కేసు నమోదయింది. కోర్టుకు హాజరు కానందున గత నెల 26న ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం కోర్టులో లొంగిపోయారు. అనంతరం కోర్టు 8వ తేదీన కోర్టుకు తిరిగి హాజరు కావాలని జగ్గారెడ్డిని ఆదేశించింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు. తెరాస నాయకులు ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వేరే పార్టీల వారిని ప్రచారానికి తిరగవద్దని ఆదేశించడం సరికాదన్నారు.
కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుందనడం సరికాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు వేరుగా అన్నారు. తెలంగాణ రావడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్నారు. ఘర్షణ వాతావరణం తెలుగు ప్రజలకు మంచిది కాదన్నారు. బిల్లులో పేర్కొన్న వాటినే కేంద్రం అమలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

బీజేపీ
తెలంగాణ రాష్ట్ర సమితి, సీఎం చంద్రశేఖర రావు పైన భారతీయ జనతా పార్టీ బీజేపీ మెదక్ లోకసభ అభ్యర్థి జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బీజేపీ
ఓటమి భయంతోనే తెరాస తన పైన అభాండాలు వేస్తోందన్నారు. వ్యక్తిగతంగా కాకుండా.. అభివృద్ధిలో పోటీ పడదామని ఆయన సవాల్ చేశారు.

బీజేపీ
తెలంగాణ రాష్ట్ర సమితి టిక్కెట్లు అమ్ముకుందన్నారు. తన వద్ద డబ్బుంటే తెరాస టిక్కెటే కొనుక్కునే వాణ్ణి అన్నారు. కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉందంటే అది బీజేపీ బిక్షే అన్నారు.

బీజేపీ
తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఉద్యమంలో ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఓటమి భయంతో తెరాస తన జపం చేస్తోందన్నారు.

బీజేపీ
హరీష్ రావు రోజు తన జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని బీజేపీ నేత చింతల రామచంద్రా రెడ్డి అన్నారు.

బీజేపీ
జగ్గారెడ్డి ఆరెస్సెస్ కార్యకర్త అని చింతల రామచంద్రా రెడ్డి అన్నారు. తాము గెలిచేందుకు అవకాశం ఉండటంతో తెరాస ఆరోపణలు చేస్తోందన్నారు.

బీజేపీ
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆంధ్రా వారిని తిట్టి పబ్బం గడుపుకుంటున్నారని తూర్పు జయప్రకాశ్ రెడ్డి సోమవారం నిప్పులు చెరిగారు.

బీజేపీ
ప్రజలను తెలంగాణ సర్కారు అవాస్తవాలతో మభ్యపెడుతోందని తూర్పు జయప్రకాశ్ రెడ్డి సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు.

బీజేపీ
హరీష్ రావుకు తన జపం చేయకుంటే రోజు గడవదని జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. పుట్టిన వెంనటే తెలంగాణ ఉద్యంలోకి దూకినట్లు తెరాస నేతలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications