మరో భేటీ: చంద్రబాబు ఇలా, కెసిఆర్ అలా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖాముఖి భేట అయ్యే అవకాశం ఉంది. శనివారంనాడు గవర్నర్ నరసింహన్ సమక్షంలో కృష్ణా జలాల వివాదంపై ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి సమస్యను పరిష్కరించుకున్నారు.
చంద్రబాబు, కెసిఆర్ రాజభవన్‌కు శనివారం ఉదయమే చేరుకున్నారు. నాగార్జునసాగర్ వద్ద జలాలపై తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో చంద్రబాబు, కెసిఆర్ శుక్రవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడుకుని సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందుకు అనుగుణంగానే వారు భేటీ అయ్యారు.
ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలపై కెసిఆర్, చంద్రబాబు కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, తేదీ ఇంకా నిర్ణయం కాలేదు. తగిన తేదీని ఖరారు చేసి, ఇరువురు కూడా గవర్నర్ సమక్షంలో సమావేశమయ్యే అవకాశం ఉంది.

గవర్నర్ వద్ద చంద్రబాబు
కృష్ణా జలాల వివాదాన్ని తెలంగాణతో పరిష్కరించుకోవడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్‌తో ఇలా...

చంద్రబాబుతో విడిగా..
గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో విడిగా సమావేశమయ్యారు. దేవినేని ఉమామహేశ్వరరావును కూడా చూడవచ్చు.

కెసిఆర్ ఇలా...
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించుకోవడానికి రాజభవన్ వచ్చి, ఇలా నరసింహన్‌తో...

ఇరువురితో ఇలా..
గవర్నర్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఇలా సమావేశమయ్యారు.

ఇరువురు ముఖ్యమంత్రులు ఇలా...
గవర్నర్ అధికారిక నివాసం రాజభవన్‌లో ఇరువురు ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు ఇలా కనిపించారు..

ఇరువురితో గవర్నర్ ఇలా..
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ ఇలా కనిపించారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఇలా చొరవ చూపారు.

కెసిఆర్‌తో ఇలా...
గవర్నర్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో ఇలా చేతులు కలిపారు. పక్కనే చంద్రబాబు ఉన్నారు.

చేతుల కలుపుకున్నారు...
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరస్పరం మరోసారి కరచాలనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications