వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చావుదాకా వెళ్లొచ్చా, బాబుపై కేసీఆర్ ఆగ్రహం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: తెలంగాణలో అర్హులయిన ప్రతి పేదకూ పెన్షన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పునరుద్ఘాటించారు. అదే సమయంలో అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితాలో చోటు కల్పించేది లేదన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు మండలం రంగాపూర్‌లో శనివారం ముఖ్యమంత్రి ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పలువురు వృద్ధులు, వితంతువులకు పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

అదే సమయంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు పైన దుమ్మెత్తి పోశారు. తమ ప్రభుత్వం పైన విపక్షాలు, చంద్రబాబు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాను ఎప్పుడు అబద్దాలు చెప్పలేదని, కొత్త రాష్ట్రం అయినందున తెలంగాణలో కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సమస్యలు ఉంటాయని ప్రచారం సమయంలోనే తాను చెప్పానన్నారు.

పాత జాబితాల నుంచి అర్హులయిన పేదల పేర్లు తొలగిస్తున్నారంటూ కొందరు దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తున్నారని, అర్హులయిన వారు మాత్రం తహసీల్దారు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, ఆర్డీవో విచారణ జరిపి అర్హులకు పెన్షన్లు ఇస్తారని కేసీఆర్‌ తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన సందర్భంగా తానే కమిటీతో పోరాడి వెయ్యి రూపాయల వృద్ధాప్య పెన్షన్‌ హామీ చేర్చినట్లు తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

రూ.675 ఇస్తే సరిపోతుందని కమిటీ సభ్యులు పేర్కొనగా... వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందేనని తాను చెప్పానని కేసీఆర్ అన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు వికలాంగులకు 1,500 రూపాయల పింఛన్‌ అందుతుందన్నారు. పెన్షన్లకు ఏటా రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

రాష్ట్రంలో అర్హులయిన పేదలందరికీ కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఒక్కొక్కరికి కిలో రూపాయి చొప్పున 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని... కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికీ ఇది వర్తిస్తుందని చెప్పారు. త్వరలోనే కొత్త కార్డులు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.30 వేల కోట్లతో తెలంగాణ వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

 కేసీఆర్

కేసీఆర్

ఆడ బిడ్డలకు తీపి కబురు అంటూ వాటర్‌ గ్రిడ్‌ గురించి తెలిపారు. ఐదేళ్లలో ప్రతీ ఇంటికీ నల్లా నీరు అందించి తీరుతామని,వాటర్ గ్రిడ్‌ సర్వే పూర్తికాగానే అన్ని చోట్లా శంకుస్థాపనలు చేస్తామన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

ప్రతీ ఇంటికి తాగునీరు ఇచ్చి ఆడబిడ్డల పాదాలు కడుగుతాని, ఐదేళ్ల తర్వాత ఏ ఒక్క మహిళ కూడా బిందె పట్టుకుని బజారులో కనిపించకుండా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఐదేళ్లలో ప్రతీ ఇంటికీ, ప్రతీ తండాకు తాగునీరు సరఫరా చేసి తీరుతామని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓట్లడగడానికి రాదన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ సందర్భంగా చెప్పారు.

 కేసీఆర్

కేసీఆర్

ఈ పథకానికి 15 రోజుల్లో శంకుస్థాపన చేస్తామని ఇది పూర్తయితే మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్‌ నగరానికి కూడా తాగునీరు సరఫరా అవుతుందని తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

రాష్ట్రవ్యాప్తంగా 20వేల కిలోమీటర్ల మట్టిరోడ్లను రూ. 600కోట్లు వెచ్చించి నాలుగు నెలల్లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

మూడేళ్ల తరువాత నిరంతర విద్యుత్తు ఇస్తామని, అప్పటి వరకు రైతులు సహకరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరారు.

 కేసీఆర్

కేసీఆర్

కరెంటంటే షాపులో దొరికే వస్తువు రాేబవ, మొన్ననే ఛత్తీస్‌గఢ్‌ పోయి ఎంవోయూ చేసుకున్నామని, ఏడాదిలోగా కొంత మెరుగుపడుతుందన్నారు.

కేసీఆర్

కేసీఆర్

రెండేళ్లలో తొమ్మిది గంటల విద్యుత్తు ఇస్తామని, మూడేళ్ల తర్వాత క్షణం కూడా పోకుండా విద్యుత్తు సరఫరా చేస్తామని, ఇది కేసీఆర్‌ మాట అన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

ఛత్తీస్‌గఢ్‌ నుంచి లైన్లు వేయడానికి లైన్లు వేయడానికి ఒకటి రెండేళ్లు పడుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు.

 కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానాలు చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు. తాను కూడ చావు అంచుల దాకా వెళ్లానని పేర్కొన్నారు. ప్రజల దీవెనలతోనే బతికానని చెప్పారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కష్టాలు ఉన్నాయని అంగీకరించారు.

కేసీఆర్

కేసీఆర్

ముక్కుసూటిగా మాట్లాడటమే తెలుసునని, దొంగమాటలు, అబద్ధాలు చెప్పడం తన జన్మకు లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసి చూపామని, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు.

English summary
Photos of KCR launched AASARA New Pension Scheme at Kottur Village of Mahabubnagar District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X