ఏపీ చలనచిత్రాభివృద్ధి సంస్థకు కేసీఆర్ షాక్ (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న సొసైటీ భూములపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే గురుకుల్ ట్రస్ట్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది.

మరోవైపు గోకుల్ ప్లాట్స్‌లోను అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో బాధితులు మొరపెట్టుకున్నారు. అయితే, నివాసం ఉంటున్న వాటిని కూల్చవద్దని జీహెచ్ఎంసీ చెబుతోంది. 20 భవనాలకు నోటీసులు ఇచ్చామని, అక్రమ నిర్మాణాల పైన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ చెబుతోంది.

తాజాగా, షేక్‌పేట పరిధిలోని ఆంధ్రప్రదేశ్ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎపిఎఫ్‌డిసి) సంబంధించిన భూములను శనివారం తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డులను కూల్చివేసి తెలంగాణ ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేశారు.

ఎఫ్‌డీసీ

ఎఫ్‌డీసీ

హైదరాబాదులోని ఫిలిం నగర్‌లో చలన చిత్రాభివృద్ధి (ఎఫ్‌డిసి)కి కేటాయించిన భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 16.48 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకుంది.

ఎఫ్‌డీసీ

ఎఫ్‌డీసీ

భూమి కేటాయించి మూడున్నర దశాబ్దాలు గడిచినా స్థలాన్ని వాడుకోకపోవడంతో ప్రభుత్వం ఆ చర్యకు దిగింది. ఆ స్థలాన్ని వెనక్కితీసుకుంటూ శుక్రవారం సీసీఎల్‌ఏ సిన్హా ఉత్తర్వులిచ్చారు.

 ఎఫ్‌డీసీ

ఎఫ్‌డీసీ

మరో నాలుగు ఎకరాల్లో ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఆ వెంటనే హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎంకే మీనా ఆదేశాలతో క్షేత్రస్థాయి సిబ్బంది రంగంలోకి దిగారు.

 ఎఫ్‌డీసీ

ఎఫ్‌డీసీ

‘ఈ స్థలం ప్రభుత్వానిది' అంటూ బోర్డులు పెట్టారు. ఒకప్పడు మద్రాసులో ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు రప్పించడానికి, అప్పటి ప్రభుత్వం భూములు ఇచ్చింది, పలు ప్రోత్సహకాలు కూడా ఇచ్చింది.

ఎఫ్‌డీసీ

ఎఫ్‌డీసీ

అందులో భాగంగా 1982లో జీవో నెం.1015 ద్వారా షేక్‌పేట మండలం సర్వేనెం.403లో ఫిలింనగర్‌లో 50 ఎకరాల స్థలాన్ని ఎఫ్‌డీసీకి అప్పగించారు.

ఎఫ్‌డీసీ

ఎఫ్‌డీసీ

ఎకరానికి రూ.8500లు మాత్రమే వసూలు చేశారు. ఇందులో పద్మాలయ స్టూడియోస్‌కు 9.5 ఎకరాలు, సురేష్ ప్రొడక్షన్స్‌కు 5 ఎకరాలు, ఆనంద్‌ సినీ సర్వీసెస్‌కు మరో 5 ఎకరాలు కేటాయించారు. పదెకరాలను హౌసింగ్‌ బోర్డుకు కూడా కేటాయించారు.

 ఎఫ్‌డీసీ

ఎఫ్‌డీసీ

ఆ రకంగా మరో 20 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ‘మీకు కేటాయించిన భూమిని రక్షించుకుంటారా? లేక మేం స్వాధీనం చేసుకోవాలా?' అంటూ 2013 జూన్‌లో హైదరాబాద్‌ జిల్లా యంత్రాంగం నోటీసులు ఇచ్చింది. అయినా ఎఫ్‌డీసీ అధికారులు పట్టించుకోలేదు.

 ఎఫ్‌డీసీ

ఎఫ్‌డీసీ

ఏడాది కిందట ల్యాండ్‌ ఆడిట్‌ చేయడంతో ఎఫ్‌డీసీ నిర్లక్ష్యం బయటపడింది. దాంతో ఎఫ్‌డీసీకి కేటాయింపులు రద్దుచేసి, భూమిని వెనక్కితీసుకోవడానికి అనుమతించాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎంకే మీనా గత నెల 21, 27 తేదీల్లో సీసీఎల్‌ఏకు లేఖ రాశారు. ఈ లేఖపై బుధవారం ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎల్‌ఎంఏ) సమావేశంలో చర్చించారు.

ఎఫ్‌డీసీ

ఎఫ్‌డీసీ

భూమిని వెనక్కితీసుకోవాలని సిఫార్సు చేశారు. మూడెకరాలు వాణిజ్య పన్నుల శాఖకు ఎఫ్‌డీసీ నుంచి వెనక్కితీసుకున్న 16 ఎకరాల భూమిలో మూడెకరాలను వాణిజ్య పన్నుల శాఖ ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు.

 కోఠీ

కోఠీ

మరోవైపు, కోఠీలో ఉన్న ఉన్న ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) ఆస్పత్రి స్థలాన్ని కాపాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. శనివారం రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈఎన్‌టీ ఆస్పత్రికి చెందిన భూమిని స్వాధీనం చేసుకొని, ఆస్పత్రికి అప్పగించాలని ఆదేశించారు. ప్రభుత్వం రంగంలో దేశంలోనే పెద్దదైన ఈఎన్‌టీ ఆస్పత్రిని కాపాడాలని ఆదేశించారు. ఈ వివాదం న్యాయస్థానంలో ఉందని, ఈ స్థలంపై స్టే ఉందని అధికారులు సీఎంకు వివరించారు.

 కోఠీ

కోఠీ

హైకోర్టు ఆదేశాలతో సర్వే చేసి, నివేదికను న్యాయస్థానానికి సమర్పించామని అధికారులు తెలిపారు. 2012లో సిటీ సివిల్‌ కోర్టు ‘ఈ స్థలం ప్రభుత్వానిదే' అని తీర్పు చెప్పిందన్నారు. ఈ భూమిపై క్లెయిమ్‌దారులకు ఎలాంటి హక్కులు లేవని తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. అయితే, హైకోర్టులో ఉన్న స్టేపై అడ్వకేట్‌ జనరల్‌తో చ ర్చించి, దానిని వేకెట్‌ చేయించాలని కేసీఆర్‌ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+