కిరణ్ మొక్కు: ఎడ్లబండిపై వచ్చి, ఢిల్లీకి ఆఫర్ (పిక్చర్స్)
హైదరాబాద్: విజయవాడ నగరంలోని స్వరాజ్‌మైదాన్‌లో పులిచింతల ప్రారంభోత్సవ సభకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎడ్డబండిపై సభాస్థలికి చేరుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన విభజన విషయంలో పార్టీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు.
రాష్ట్ర విభజన బిల్లుకు సహకరించమని, అసెంబ్లీలో ఓడించి తీరుతామని, ఓడిన బిల్లును పార్లమెంటులో ఎలా ఆమోదిస్తారో చూస్తామని కిరణ్ అన్నారు.
'కృష్ణా డెల్టా వందేళ్ల కల అయిన పులిచింతల ప్రాజెక్టును నేను ప్రారంభించడం పూర్వజన్మ సుకృ తం. అదెంత గొప్పగా భావిస్తున్నానో రాష్ట్ర విభజన అంత దురదృష్టకరమని అనుకుంటున్నాను. నేను సిఎంగా ఉండగా విభజనకు సహకరించేది లేదు. ముసాయిదా బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. అందులో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఉన్నాయి. బిల్లు అసెంబ్లీకి వస్తుంది. అక్కడ ఓడిస్తాం. ఇక్కడ ఓడిన బిల్లును పార్లమెంటులో ఎలా తెస్తారో చూస్తాం!'' అన్నారు.

కిరణ్ 1
తామేం పాపం చేశామని అధిష్ఠానాన్ని కిరణ్ నిలదీశారు. కాంగ్రెస్‌కు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి ఆదుకోవడమే పాపమా? అని ప్రశ్నించారు.

కిరణ్ 2
1977లో ఇందిరమ్మకు కష్టంవస్తే 41 సీట్లిచ్చామని, తిరిగి కాం గ్రెస్‌కు 30సీట్లు ఇచ్చామని, 2009లో మళ్లీ 33సీట్లిచ్చి గెలిపించామని, కాంగ్రెస్ కు ఇంత బలమున్న రాష్ట్రాన్ని బలహీ నపరుస్తారా? కెసిఆర్ చెప్పారని, జగన్ కలుస్తారని, బాబు జాబు ఇచ్చారని విడదీస్తారా? కూర్చున్న కొమ్మనే నరుక్కుంటామా? అని నిలదీశారు.

కిరణ్ 3
రాష్ట్రం వేరు. రాజకీయం వేరని, ఒకసారి ఓడిపోతే మరోసారి గెలుస్తామని, కావాలంటే కెసిఆర్‌ను లేదా జగన్‌ను సిఎం చేసుకోండని, చంద్రబాబు కలుస్తానంటే ఆయననూ కలుపుకుని సిఎంను చేయండని, అభ్యంతరం లేదని కానీ, రాష్ట్రాన్ని విభజించవద్దన్నారు.

కిరణ్ 4
రాజకీయ లాభం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేం ఎంతమాత్రం ఒప్పుకోం.. ఒప్పుకోం.. ఒప్పుకోం' అని కిరణ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు.

కిరణ్ 5
'పొరపాటును దిద్దుకుంటే తప్పులేదు. ఢిల్లీలో కూర్చున్న మేధావులారా! ఇప్పటికీ మించిపోలేదు. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి. రాష్ట్రం హర్షిస్తుంది'' అన్నారు

కిరణ్ 6
రాష్ట్రం విడిపోతే ఇరు ప్రాంతాలకు అన్నీ కష్టాలేనని సోదాహరణంగా చెప్పారు. గతంలో ప్రస్తావించిన సాగునీరు, విద్యుత్తు అంశాలను మరోసారి బహిరంగంగా చెప్పారు.

కిరణ్ 7
"ఉద్వేగాలు, భేదాభిప్రాయాలు, వెనుకబాటుతనం వంటివి దేశంలో అన్ని చోట్లా ఉంటాయి. ఇదే ప్రాతిపదిక అయితే ఎన్ని రాష్ట్రాలుగా విడిపోతామని ఇందిరాగాంధీ 1972లో పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్ని అందరూ వినాలి. విభజన నిర్ణయం తీసుకున్నవారు చాలా తెలివైన వారు. ఒక్కసారి ఇందిరమ్మ ప్రసంగాన్ని చదివితే ఎవ రూ విభజన కోరుకోరని స్వయంగా వారికి చెప్పాను'' అని వివరించారు.

కిరణ్ 8
ఇందిరాగాంధీ గట్టి ముడివేస్తే కాంగ్రెస్ పార్టీయే ఆ ముడిని విప్పాలని చూస్తోందని ఆక్రోశించారు. రాష్ట్రాన్ని విడగొడితే 2 లక్షల మంది ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయని, బదిలీలు, సర్వీసు మ్యాటర్స్, పెన్షన్ల విషయంలో అనేక ఇక్కట్లు వస్తాయని చెప్పారు.

గుంటూరు
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం జూడపల్లితండా వద్ద పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాయంత్రం విజయవాడ నగరానికి చేరుకుని స్వరాజ్య మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఉద్వేగంతో మాట్లాడారు.

కృష్ణా
సభకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి రైతులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభకు రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి అధ్యక్షత వహించారు.

కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా ఈ రాష్ట్రమే ఆదుకున్న విషయాన్ని ఢిల్లీ పెద్దలు మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications