వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్సార్‌లో సందడి: ప్రణబ్ రాక, చెట్టాపట్టాలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సామాన్యులకు కూడా న్యాయవిద్య అందాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శనివారం అన్నారు. నల్సార్ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో మరింత లోతైన, విస్త్రతమైన పరిశోధనలు పెరగాలని ఆకాంక్షించారు.

ఉన్నత విద్యలో సంస్కరణలు అవసరమన్నారు. ప్రాథమిక హక్కులను అందరూ వినియోగించుకునేలా న్యాయవృత్తిలో ఉన్న వారు చూడాలన్నారు. ప్రజలకు నిష్పక్షపాతంగా న్యాయ సేవలు అందించాలని విద్యార్థులకు సూచించారు.

ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

చట్టాల అమలు, వివాదాల పరిష్కారంలో ఇప్పటికీ మనపై వలసవాద ఛాయలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, ఇలాంటి వాటిని దూరం చేయడానికి న్యాయ విద్యార్థులు తగిన కృషి చేయాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆకాంక్షించారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

వలసవాద ఛాయల నుంచి బయటపడి సామాన్యులకు న్యాయాన్ని చేరువ చేయడానికి న్యాయవిద్యార్థులు లోతైన పరిశీలన చేయాలని రాష్ట్రపతి సూచించారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

ప్రస్తుతం న్యాయ విద్య.. మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ తరహాలో ఆకర్షణీయంగా మారిందని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి మార్పును ఆహ్వానించాల్సిందే అన్నారు.

ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

కానీ ఈ ధోరణి శృతిమించకుండా చూసుకోవాలన్నారు. ప్రజలకు న్యాయాన్ని అందించడం..రాజ్యాంగాన్ని సజీవంగా నిలపడం.. న్యాయవాదులపైనున్న బృహత్తర బాధ్యత అన్నారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

నిజానికి చట్టాలు అమలవుతున్న ఏ సమాజంలోనైనా న్యాయవాద వృత్తి గౌరవప్రదమైనదిగా రాణిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

గత రెండు దశాబ్దాల్లో న్యాయవాద వృత్తి చాలా మార్పులు సంతరించుకుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

అయినా ఇంకా కొన్ని న్యాయవాద అంశాలను మరింత పరిపూర్ణం చేయాల్సి ఉందని, న్యాయ విద్యను అందించే సంస్థలు న్యాయ విద్యతో పాటు సిద్ధాంతాలకు.. క్షేత్రస్థాయి వాస్తవాలకు ఉన్న ఖాళీని పూరించే విధంగా బోధనావిధానాన్ని మార్పు చేసుకోవాలని సూచించారు.

ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

న్యాయ విద్యార్థులు చట్టాలను ఎంతగా అవపోసన పట్టినా వారు కూడా చట్టపరిధిలో పని చేయాల్సి ఉంటుందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

కేవలం జీవన భృతి సంపాదించడం కోసమే న్యాయవిద్యను చదవడం కాకుండా, సామాన్యుడికి న్యాయశాస్త్రం ద్వా రా వీలైన మేలు చేయాలన్న దిశగా విద్యార్థులు నిరంతరం ఆలోచించాలన్నారు.

ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

రాజ్యాంగ నిర్మాతలు మనకు చాలా విలువైన న్యాయ సంపదను అందించారని, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను పరిష్కరించేలా చాలా అంశాలను రాజ్యాంగంలో పొందుపర్చారని ప్రణబ్ పేర్కొన్నారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

వాటి ద్వారా మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించేందుకు న్యాయవాదులు తమ వంతు పాత్ర పోషంచాలన్నారు. సమాజంలోని సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు న్యాయ కోవిదులు, విధాన నిర్ణేతలు దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

16 ఏళ్ల తక్కువ కాలంలోనే నల్సార్‌ యూనివర్సిటీ దేశంలోనే ఒక ప్రముఖ న్యాయ విద్యాకేంద్రంగా మారిందని రాష్ట్రపతి కొనియాడారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

వర్సిటీలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సును పెట్టేందుకు యత్నాలు చేయడం సంతోషకరమని ప్రణబ్ అన్నారు. విద్యార్థులు తమ వృత్తిలో మరింత ప్రావీణ్యం సంపాదించి ఉత్తమంగా రాణించాలని ఆకాంక్షించారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

సామాన్యులకు కూడా న్యాయవిద్య అందాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శనివారం అన్నారు. నల్సార్ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ పాల్గొన్నారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో మరింత లోతైన, విస్త్రతమైన పరిశోధనలు పెరగాలని ఆకాంక్షించారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

ఉన్నత విద్యలో సంస్కరణలు అవసరమన్నారు. ప్రాథమిక హక్కులను అందరూ వినియోగించుకునేలా న్యాయవృత్తిలో ఉన్న వారు చూడాలన్నారు. ప్రజలకు నిష్పక్షపాతంగా న్యాయ సేవలు అందించాలని విద్యార్థులకు సూచించారు.

ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

కాగా, నల్సార్‌లో జరిగిన ఈ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, గవర్నర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

చట్టాల అమలు, వివాదాల పరిష్కారంలో ఇప్పటికీ మనపై వలసవాద ఛాయలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, ఇలాంటి వాటిని దూరం చేయడానికి న్యాయ విద్యార్థులు తగిన కృషి చేయాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆకాంక్షించారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

వలసవాద ఛాయల నుంచి బయటపడి సామాన్యులకు న్యాయాన్ని చేరువ చేయడానికి న్యాయవిద్యార్థులు లోతైన పరిశీలన చేయాలని రాష్ట్రపతి సూచించారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

ప్రస్తుతం న్యాయ విద్య.. మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ తరహాలో ఆకర్షణీయంగా మారిందని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి మార్పును ఆహ్వానించాల్సిందే అన్నారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

కానీ ఈ ధోరణి శృతిమించకుండా చూసుకోవాలన్నారు. ప్రజలకు న్యాయాన్ని అందించడం..రాజ్యాంగాన్ని సజీవంగా నిలపడం.. న్యాయవాదులపైనున్న బృహత్తర బాధ్యత అన్నారు.

 ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

నిజానికి చట్టాలు అమలవుతున్న ఏ సమాజంలోనైనా న్యాయవాద వృత్తి గౌరవప్రదమైనదిగా రాణిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు.

English summary
President Pranab Mukherjee today called for making administration of justice more representative and responsive to the citizens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X