వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడుపుకోత: మందకృష్ణ మాదిగ ఓదార్పు! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సాయం పైనే కొత్త ప్రభుత్వం సంతకం పెట్టాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిజాం కళాశాలలోని అమరుల తల్లుల కడుపుకోత సభలో అన్నారు. అమరుల కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. లేదంటే తెలంగాణ అమరుల కుటుంబాలకు కొడుకుగా, అన్నగా అండగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తానన్నారు.

ఇక నుంచి ఉద్యమాన్ని అమరవీరుల తల్లుతోనే ప్రారంభిస్తానని, అమరుల తల్లులు, బిడ్డలే ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అమరుల తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులను వేదికపై ఆసీనులు చేసి, వారి తాగ్యాలను స్మరించారు. తెచ్చేది తామని తెరాస, ఇచ్చేది తామని కాంగ్రెస్ పార్టీలు చెప్పడాన్ని మంద కృష్ణ తీవ్రంగా గర్హించారు. ఇచ్చేది, తెచ్దేచి మీరే అయితే అమరుల త్యాగాలు ఏమైనట్లు అని ప్రశ్నించారు.

అమరుల త్యాగాలను కాలరాసే కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో, అనంతరం తెలంగాణ ఉద్యమంలోనూ త్యాగాలు చేసిన వారి చరిత్రను కాలరాసి, తదుపరి నేతలు పదవులల్లో వెలిగారని విమర్శించారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలోనూ పలువురు అమరులైన సమయంలో వారిని కీర్తించిన నేతలే నేడు వారిని మరిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చే సోనియాను దేవతగా గుడి కట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని, తెచ్చేది కెసిఆర్ అంటూ ఆయనను జాతిపితగా కీర్తించుకున్నా అభ్యంతరం లేదని కానీ తెలంగాణ అమరుల త్యాగాలను కాలరాస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కడుపుకోత 1

కడుపుకోత 1

అమరుల చరిత్రను పరిరక్షించాల్సిందే వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందేనంటూ మంద కృష్ణ డిమాండ్‌లు చేశారు. ఈ డిమాండ్‌లను నెరవేర్చేందుకు తెలంగాణలో ఏర్పాటయ్యే ప్రభుత్వం మొదటి సంతకం చేయాలన్నారు.

కడుపుకోత 2

కడుపుకోత 2

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు డిసెంబర్ 10 తేదీలోగా పార్లమెంటులో బిల్లును ఆమోదింపచేయాలని డిమాండ్ చేశారు. లేదంటూ డిసెంబర్ 11న కలెక్టరేట్‌లు/అసెంబ్లీ/ పార్లమెంట్‌ల ముట్టడి చేపడతామని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.

కడుపుకోత 3

కడుపుకోత 3

డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా, ఈ ప్రక్రియపై ముందడుగు వేయకపోవడం వల్లే వెయ్యి మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సోనియా నిర్లక్ష్యమే ఈ బలిదానాలకు కారణమని ధ్వజమెత్తారు.

కడుపుకోత 4

కడుపుకోత 4

పార్లమెంట్‌లో సోనియా అనారోగ్యానికి గురైతే వెంటనే అమెరికాకు తీసుకెళ్లి వైద్యం చేయించుకున్నారని, ఆమెకు ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ తెలంగాణపై లేదని ఆరోపించారు.

కడుపుకోత 5

కడుపుకోత 5

సోనియా నిర్లక్ష్యం చేయకపోతే అమరుల తల్లులకు కడుపుకోత ఉండేది కాదని, మరో వైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సతీమణులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గవర్నర్‌ను, రాష్ట్రపతిని కలిశారని మందకృష్ణ మండిపడ్డారు.

కడుపుకోత 6

కడుపుకోత 6

రాష్ట్రం విడిపోతే తమ బిడ్డలకు ఏం చెప్పాలని సీమాంధ్ర నేతల సతీమణులు ప్రశ్నించారని అయితే ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు ఫొటోను పెట్టుకున్నారు.

కడుపుకోత 7

కడుపుకోత 7

ఒక్క పొట్టి శ్రీరాములు త్యాగం చేస్తేనే రాష్ట్రం ఏర్పాటైతే వెయ్యి మందికి పైగా త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలా? లేదా? బతికున్న బిడ్డలకే ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించిన వారు బలిదానాలు చేసిన అమరుల విషయంలో ఏం సమాధానం చెబుతారు?

కడుపుకోత 8

కడుపుకోత 8

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం కేంద్రంలో కీలక స్థానంలో ఉన్న ముగ్గురు మహిళల చేతిలోనే ఉంది. ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సోనియాగాంధీ, ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌లు తెలంగాణ తల్లుల కడుపుకోత మరిచిపోవద్దన్నారు.

కడుపుకోత 9

కడుపుకోత 9


కన్నతల్లుల బాధను అర్థం చేసుకుని వెంటనే బిల్లు పెట్టి, ఆమోదం పొందేలా చూడాలని కోరారు. తెలంగాణ ఏర్పాటయితేనే ఆత్మహత్యలు ఆగుతాయన్నారు.

కడుపుకోత 10

కడుపుకోత 10

కాంగ్రెస్ నిర్ణయానికి కిరణ్ కుమార్ రెడ్డి కట్టుబడి ఉంటారని దిగ్విజయ్ సింగ్ ఒక వైపు చెబుతుంటే, కిరణ్ తాను సమైక్వవాదినని పదే పదే అంటున్నారన్నారు.

కడుపుకోత 11

కడుపుకోత 11

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలాగూ యూటర్న్ తీసుకున్నారని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.

కడుపుకోత 12

కడుపుకోత 12

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు బిజెపి నేత వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు కూడా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.

కడుపుకోత 13

కడుపుకోత 13

ఒక వైపు తెలంగాణ ప్రక్రియను కేంద్రం ముందుకు తీసుకెళుతున్నా అడ్డుకునే ప్రయత్నాలు ఆగలేదని మందకృష్ణ మాదిగ దనుమడారు.

కడుపుకోత 14

కడుపుకోత 14

సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు, ఉద్యోగులు ఇప్పటి వరకు సమైక్యాంధ్ర నినాదంతో రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేశారని, కొద్ది రోజులుగా వారు పంథాను మార్చి సమస్యల పేరిట అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

కడుపుకోత 15

కడుపుకోత 15

హైదరాబాద్‌ను యూటీ చేయాలని, గవర్నర్ పాలన ఉండాలని, హైదరాబాద్ ఆదాయాన్ని పంచాలన్న డిమాండ్ చేస్తున్నారని ఈ సమస్యల పేరిట పరోక్షంగా వారు సమైక్యాంధ్ర ఉద్యమమే చేస్తున్నారని విమర్శించారు.

కడుపుకోత 17

కడుపుకోత 17

తెలుగు వారున్నారన్న కారణంగా ఢిల్లీ, బెంగుళూగరు, ముంబైని యూటీ చేయగలరా? ఆమెరికాలో గవర్నర్ పాలన తేగలరా? అన్నారు.

కడుపుకోత 18

కడుపుకోత 18

హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం, గవర్నర్ పాలన అంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితమేనని మందకృష్ణ మాదిక సభలో హెచ్చరించారు.

కడుపుకోత 19

కడుపుకోత 19

ఈ సమావేశంలో అమరుల తల్లులు చంద్రమ్మ, శశికళ, రాజేశ్వరి, పద్మ, జ్యోతి, పోచమ్మ, శాంతమ్మ, రత్నమ్మ, సుశీల, అంజమ్మ, మంత్రినాయక్‌తో పాటు వెంకటాచారి మాట్లాడారు.

కడుపుకోత 20

కడుపుకోత 20

తమ కుటుంబాల దీనస్థితిని వివరించడంతో పాటు ఆయా పార్టీల నేతల వైఖరిపై అమరవీరుల కుటుంబాల సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కడుపుకోత 21

కడుపుకోత 21

తెలంగాణ అమరులకు సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. జోహార్లు అర్పిస్తూ చేసిన మంగళహారతి నృత్యం ఆకట్టుకుంది. కళాకారుల ఆటపాటలతో సభ సాగింది.

కడుపుకోత 22

కడుపుకోత 22

వేదికపై తెలంగాణ తల్లిగా చాకలి ఐలమ్మ చిత్ర పటాన్ని ప్రదర్శించారు. వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిచారు.

English summary
Madiga Reservation Porata Samithi chief Manda Krishna Madiga demanded political parties to help Amaraveerula families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X