వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్! రెచ్చగొడ్తున్నవ్, అందుకే వచ్చా:పవన్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/మహబూబ్ నగర్: తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనకు తగిన బుద్ధ్ది చెప్పేందుకు ప్రజలు సిద్ద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ప్రశ్నించేందుకే వచ్చానని చెప్పారు.

శుక్రవారం హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలను అమాయకులుగా అభివర్ణిస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి నేడు ఆ పదవి కోసం పాకులాడటం ఎంతవరకు సమంజస మన్నారు. కెసిఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి, కుంభకోణాల్లో మునిగిపోయిందని, ఆ ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు వేస్తే ఐదు సంవత్సరాల పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని అన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే దేశంలో సుస్థిర పాలన అందించడమే కాకుండా ఎన్నో కొత్త పథకాలను రూపొందించుకునే అవకాశాలు ఉంటాయని అన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవాలంటే ఇక్కడ పార్లమెంట్ స్థానాల బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. మోడికి ఓట్లు వేసి గెలిపిస్తే తెలంగాణ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

సమాజంలో ప్రశ్నించే వారు లేకపోవడం వల్లే కెసిఆర్ లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చిన రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది ఏమాత్రం సహించే ప్రసక్తి లేదన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలంగాణపై ప్రేమ ఉన్నందుకే తాను ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నానే తప్ప ఎవరో చెప్పారని పర్యటించడం లేదన్నారు. అమరవీరుల త్యాగఫలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తప్ప కెసిఆర్ చేసిన ఉద్యమం వల్ల కాదన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్రం ఇవ్వకముందు సోనియా గాంధీని దేవత అని పొగిడిన కేసీఆర్ నేడు నానా రకాలుగా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తాను తెలంగాణవాదినే అయినప్పటికిని తన వ్యవసాయ క్షేత్రంపై తెలంగాణవాదులు దాడులు చేసినా సహించానే తప్ప ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. కెసిఆర్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

కెసిఆర్‌కు తెలిసిందల్లా తిట్ల పురాణమేనని మండిపడ్డారు. అమరుల త్యాగం వల్ల తెలంగాణ వచ్చిందని, ఇద్దరు ఎంపీలతో తెరాస తెలంగాణ ఎలా తెస్తుందని ప్రశ్నించారు. త్యాగ ఫలాలు అడ్డం పెట్టుకొని సిఎం కావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెరాసది ఆచరణ సాధ్యం కాని ముసాయిదా అని, ఢిల్లీలో దేవత అయిన సోనియా... హైదరాబాదుకు వచ్చేసరికి దెయ్యం అయిందా అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే ఉద్యమకారులను పక్కన పెట్టి, తాను, తన కుటుంబసభ్యులే తెలంగాణాను సాధించామన్నట్టు సోనియాని కలిసి కృతజ్ఞతలు తెలిపి వచ్చిన కెసిఆర్ ఆ తర్వాత మాట మార్చి, తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియానే దూషిస్తూ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలంగాణ కోసం బలిదానాలు చేసిన యువత కుటుంబాలకు అండగా నిలుస్తానన్నారు. విభజనపై యూపిఏ ముందే ప్రకటన చేస్తే 1200 మంది అమాయకుల ప్రాణాలు నిలిచేవని, కేవలం కొడుకు కోసం సోనియా విభజన అనే వికృత క్రీడ తెరలేపారని దుయ్యబట్టారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఎన్డీయేనైనా నిలదీస్తానన్నారు. యూపిఏ, ఎన్డీయేలు రాష్ట్రానికి ఇంటి పెద్దలు లాంటివని, అలాంటి ఇంటి పెద్దలను కెసిఆర్ దూషిస్తూపోతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని పవన్ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఢిల్లీలో సోనియాను దేవత అని పొగిడి, హైదరాబాద్‌కు రాగానే అదే దేవతను దెయ్యంగాను.. బలిదేవతగానూ మార్చేసిన ఘనత కెసిఆర్‌దే అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో నైజం ఉంటుందని, కెసిఆర్‌కు తిట్టే నైజం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

దేశానికి మోడీ నాయకత్వం అవసరమన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు జై జవాన్ జై కిసాన్ అంటే.. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ మారో జవాన్, మారో కిసాన్ అంటోందన్నారు. చెల్లెళ్ల రక్షణ కోసం జనసేన హామీ ఇస్తుందన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

అసలైన మతతత్వ పార్టీ కాంగ్రెస్సే అన్నారు. సిక్కులను ఊచకోత కోసిందని ఆరోపించారు. బిజెపి మతతత్వ పార్టీ కాదన్నారు. అన్ని మతాల వారికి బిజెపిలో సమ ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎకరా భూమిలో రూ.కోటి ఎలా సంపాదించవచ్చు కెసిఆర్ చెప్పాలని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కమలం, సైకిల్ గుర్తులకు ఓటు వేసి ఆ పార్టీల అభ్యర్థులను గెలిపించాలన్నారు.

English summary
Telangana was possible due to martyrdom and sacrifice of youth, not TRS and the Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X