బిజెపి పైనా రోడ్డెక్కుతా, కెసిఆర్ చెప్తేనే: పవన్ (పిక్చర్స్)

ఏలూరు/రాజమండ్రి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయని పక్షంలో ప్రజల తరపున ఉద్యమిస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం స్పష్టం చేశారు.

భూ కబ్జాల, రాబందుల పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని రాష్ట్రం నుండి తరిమి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమిని గెలిపించాలని కోరారు.

శుక్రవారం ఆయన గోదావరి జిల్లాల్లో సుడిగాలి పర్యటన జరిపిన పవన్ కళ్యాణ్.. బిజెపి-టిడిపి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

నరసాపురం, తణుకు, కాకినాడ, రాజమండ్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జగన్ అక్రమంగా దోచిన సొమ్మును ఈ ఎన్నికల్లో పంచిపెడుతున్నారని ఆరోపించారు. అది మన సొమ్మేనని, మన నుండి దోచుకున్నదేనన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

సీమాంధ్ర ప్రజలను కెసిఆర్ తిడుతుంటే మాట్లాడలేని జగన్‌కు పౌరుషం చచ్చిపోయిందన్నారు. బిసి వర్గానికి చెందిన నరేంద్ర మోడీని కెసిఆర్ తిడుతున్నందునే తాట తీస్తానని హెచ్చరించానన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తాను క్షమాపణ చెప్పాలంటూ కెసిఆర్ తనను కూడా తిట్టాడని, ముందుగా కెసిఆర్ సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెబితే తాను క్షమాపణ చెప్పడాన్ని ఆలోచిస్తానన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తాను ఎవరికీ భయపడనన్నారు. జగన్ పార్టీ వల్ల రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండే జిల్లాలు అశాంతికి నిలయాలుగా మారాయన్నారు. మోడీ, చంద్రబాబులు దూరదృష్టి ఉన్న నాయకులన్నారు. నేను ఓటు వేయమని చెప్పిన వాళ్లుకు వేయాలని, వారు హామీలు నెరవేర్చకుంటే నేను వారిని ప్రశ్నిస్తానని, ఉద్యమిస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+