అక్కడ కిరణ్ ప్రణబ్ సహా అందర్నీనవ్వించారు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో మంగళవారం విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నగర మేయర్ మాజిద్ హుస్సేన్, పలువురు మంత్రులు, నాయకులు హాజరయ్యారు.
కాగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో చర్చ జరగకుండా ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారని ప్రణబ్ ముఖర్జీకి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బిల్లు శాసనసభకు వచ్చి 13 రోజులైనా ఇప్పటి వరకూ చర్చను ప్రారంభించలేదని, పండగ సెలవుల పేరిట కిరణ్ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ను మంగళవారం దామోదర సహా తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం కలిసింది. అయితే, హైదరాబాద్ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ దూరంగా ఉండిపోయారు. అసెంబ్లీకి బిల్లును పంపినందుకు రాష్ట్రపతికి ఈ సందర్భంగా దామోదర ధన్యవాదాలు తెలిపారు.

ప్రణబ్ 1
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మంగళవారం మధ్యాహ్నం పుష్పగుచ్ఛం ఇచ్చి రాజ్ భవన్‌లోకి ఆహ్వానం పలుకుతున్న గవర్నర్ నరసింహన్ దంపతులు.

ప్రణబ్ 2
రాజ్ భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిరునవ్వు. పక్కనే గవర్నర్ దంపతుల ఆనందం.

ప్రణబ్ 3
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజ్ భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు.

ప్రణబ్ 4
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాదులోని రాజ్ భవన్‌లో పుష్పగుచ్ఛం ఇస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

ప్రణబ్ 5
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజ్ భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల దృశ్యం.

ప్రణబ్ 6
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజ్ భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల దృశ్యం. గవర్నర్ ఇచ్చిన విందులో దామోదర, విహెచ్, నాదెండ్ల కూడా పాల్గొన్నారు.

ప్రణబ్ 7
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జానా రెడ్డి.












Click it and Unblock the Notifications