వైయస్ జగన్ మేనమామ ఇంటి కూల్చివేత (పిక్చర్స్)

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఇందిరా నగర్ సమీపంలో 472 చదరపు గజాల స్థలంలో వెలసిన కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఇంటిని సోమవారం జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేశారు. నీరజా రావు అనే దళిత మహిళకు చెందిన ఈ స్థలాన్ని రవీంద్రనాథ్ రెడ్డి ఆక్రమించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

దీనిని క్రమబద్ధీకరించాల్సిందిగా అప్పుడు ముఖ్యమంత్రిగా వైయస్‌కు రవీంద్రనాథ్ తన మనుషుల ద్వారా దరఖాస్తు పెట్టించారు. వైయస్ మరణానంతరం ఈ స్థలం క్రమబద్ధీకరణ జరిగింది. అప్పటి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ ఇందుకు పూర్తిస్థాయిలో సహకరించారని ఆరోపిస్తున్నారు. నీరజా రావు తనకు జరిగిన అన్యాయంపై పోరాటం ప్రారంభించి విజయం సాధించారు.

విలేకరుల సమావేశం ఆమె రవీంద్రనాథ్ బాగోతం వివరించారు. దీని క్రమబద్ధీకరణ అక్రమమని ఇటీవల అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వం కూడా క్రమబద్ధీకరణ ఉత్తర్వులను రద్దు చేసింది. హైకోర్టులోనూ నీరజా రావుకు అనుకూలంగా తీర్పు వెలువడింది. దీంతో వివాదాస్పద స్థలంలో రవీంద్రనాథ రెడ్డి నిర్మించిన మూడంతస్తుల ఇంటిని కూల్చివేసే ప్రక్రియను జిహెచ్ఎంసి అధికారులు సోమవారం ప్రారంభించారు.

బిల్డింగ్ 1

బిల్డింగ్ 1

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 2లో (ఇంటి నంబరు 8-3-319/6లో) 472 గజాల వివాదస్పద స్థలం ఉంది. ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన ప్లాట్లలో భాగమిది. 1986లో సొసైటీ నుంచి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈ స్థలాన్ని కొన్నారు. ఆ తర్వాత ఆయన నుంచి కెజికెఎస్ సుబ్రమణ్యం కొనుగోలు చేశారు. ఆయన నుంచి 1999 మే 21వ తేదీన ఎం రూత్ మేరీ సుశీల కొన్నారు. ఆమె వారసులే శరత్ బాబు, నీరజా రావు, విజయానంద్.

బిల్డింగ్ 2

బిల్డింగ్ 2


2006లో సుశీల చనిపోవడంతో ప్రభుత్వం ఈ ముగ్గురికి వారసత్వ ద్రువీకరణ పత్రం కూడా ఇచ్చింది. తమ స్థలంలో ఇల్లు కట్టుకుందామని ఈ ముగ్గురు నిర్ణయించుకున్నారు.

బిల్డింగ్ 3

బిల్డింగ్ 3

అయితే ఆ స్థలంలో లీజు ప్రాతిపదికన స్కూలు నడుపుతున్న వ్యక్తులు భూమిని వైయస్ బావమరిది రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. భూమిని దక్కించుకున్న ఆయన బావ అండదండతో చక్రం తిప్పినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే 2008 సెప్టెంబర్ 26న బి లక్ష్మీరాజ్యం అనే మహిళ పేరిట ప్రభుత్వానికి ఓ దరఖాస్తు వెళ్లింది. లక్ష్మీరాజ్యం.. రవీంద్రనాథ రెడ్డి కంపెనీలో పని చేసే ఓ ఉద్యోగి తల్లి.

బిల్డింగ్ 4

బిల్డింగ్ 4

'ఆ స్థలంలో నేను 1980 నుంచి నివాసం ఉంటున్నాను. స్థలాన్ని నా పేరిట క్రమద్ధీకరించండి' అని లక్ష్మీరాజ్యం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం దానిని క్రమబద్ధీకరించారు. ఇప్పుడు నీరజారావు పోరాడి సాధించుకున్నారు.

బిల్డింగ్ 5

బిల్డింగ్ 5

మా స్థలాన్ని రవీంద్రనాథ్ బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారని, 1994లో మేం స్థలాన్ని కొన్నామని, ముగ్గురం కలిసి ఇళ్లు కట్టుకోవాలనుకున్నామని, జివో నెంబర్ 166 ప్రకారం ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఏ పత్రం కూడా లేకపోయినా నవీన్ మిట్టల్ భూమిని క్రమబద్ధీకరిస్తే, ధనుంజయ రెడ్డి అండదండలతో ఇంటి నిర్మాణం చేపట్టారని నీరజా రావు వాపోయారు.

బిల్డింగ్ 6

బిల్డింగ్ 6

తమకు న్యాయం చేయాలని జగన్‌ను కలిసినా ఫలితం దక్కలేదని, రూ.4 కోట్ల ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని రవీంద్రనాథ్ రెడ్డి బంధువులు తేల్చి చెప్పారని, ప్రభుత్వానికి తాము దరఖాస్తులు పెడితే ఈ భూమి క్రమబద్ధీకరణను రద్దు చేశారని నీరజా రావు తెలిపారు.

బిల్డింగ్ 7

బిల్డింగ్ 7

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఇందిరా నగర్ సమీపంలో 472 చదరపు గజాల స్థలంలో వెలసిన కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఇంటిని సోమవారం జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+