కర్నూలును అప్పుడే రాజధానిగా ప్రకటిస్తే... (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కర్నూలును ప్రకటించాలని రాయలసీమ రాజధాని సాధన సమితి ప్రభుత్వాన్ని శనివారం డిమాండ్ చేసింది.

ఈ మేరకు శనివారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రాయలసీమ రాజధాని సాధన సమితి ప్రతినిధులు ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు.

రాయలసీమ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ భూమన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన బిల్లులో ఏపీ రాజధానిగా కర్నూలును ప్రకటించి ఉంటే ఇప్పుడు ఈ అంశంపై రచ్చ జరిగేది కాదన్నారు.

రాజధాని సాధన సమితి

రాజధాని సాధన సమితి

విశాలాంధ్ర రాష్ట్రంలో అరవై ఏళ్లు కలిసి ఉన్న తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారని, 1953లో కర్నూలు రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అదే భౌగోళిక సరిహద్దులతో ఈ రోజు ఏపీగా మిగిలిపోయిందని, నవ్యాంధ్ర రాష్ట్రానికి రాజధాని కేంద్రం ఎక్కడ ఉండాలనే అంశంపై చర్చ జరుగుతోందని, రాజధాని స్థల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు కేంద్ర హోంశాఖ శివరామకృష్ణన్ కమిటీని వేసిందన,ి రాజధాని స్థలాన్ని నిర్ధారించేందుకు కొన్ని ప్రాతిపదికలు తయారు చేసిందని రాజధాని సమితి తన ప్రెస్ నోట్లో పేర్కొంది.

రాజధాని సాధన సమితి

రాజధాని సాధన సమితి

నీరు, ప్రభుత్వ భూమి లభ్యత, రాష్ట్రంలోను, దేశంలోను ఉన్న ఇతర నగరాలతో రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి గల అవకాశాలు, వ్యవసాయ భూములు దెబ్బతినకుండా ఉండే అవకాశం, అతితక్కువ జనాభాకు పునరావాసం కల్పించాల్సిన అవకాశం, ఇతరేతర అంశాలతో పాటు ప్రకృతి వైపరీత్యాలు అయినటువంటి వరదలు, భూకంపాలు లాంటివి వచ్చే అవకాశం లేని ప్రాంతాలు, భూమి సేకరణ మరియు, భవన నిర్మాణానికి అతి తక్కువ ఖర్చు అయ్యేటువంటి ప్రాంతాలు భవన నిర్మాణానికి అవసరమైన ముడి సామాగ్రి, మానవ వనరుల లభ్యత లాటి అంశాలను అన్నింటిని పరిగణలోకి తీసుకొని రాజధానిని ఎంపిక చేయాలని శివరామకృష్ణన్ కమిటీకి హోంశాఖ తెలిపిందని రాజధాని సమితి తన ప్రెస్ నోట్లో పేర్కొంది.

రాజధాని సాధన సమితి

రాజధాని సాధన సమితి

కర్నూలును రాజధాని చేయాలని హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రాయలసీమ రాజధాని సాధన సమితి ప్రతినిధులు ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగురువేస్తున్న దృశ్యం.

రాజధాని సాధన సమితి

రాజధాని సాధన సమితి

కర్నూలును రాజధాని చేయాలని హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రాయలసీమ రాజధాని సాధన సమితి ప్రతినిధులు ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగురువేస్తున్న దృశ్యం.

రాజధాని సాధన సమితి

రాజధాని సాధన సమితి

హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రాయలసీమ రాజధాని సాధన సమితి ప్రతినిధులు కర్నూలును రాజధాని చేయాలని ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+