చిరంజీవిని శిక్షిస్తూ, బొత్స పొట్ట చీల్చుతూ! (పిక్చర్స్)

హైదరాబాద్: సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో ఉద్యమం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం వరకు ప్రజలు విద్యుత్ లేక అల్లాడారు. అయితే మొన్నటి నుండి రాత్రి ఏడు గంటల నుండి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

సిడబ్ల్యూసి నిర్ణయం, కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని రాష్ట్ర పరిరక్షణ సమితి వేదిక శుక్రవారం వెల్లడించింది. నగరంలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్సులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక సభ్యులు మాట్లాడారు.

రాష్ట్ర విభజన సమయంలో ఒక కమిషన్ నివేదిక గానీ, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం గానీ లేకుండా పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని విభజిస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. గతంలో జరిగిన రాష్ట్ర విభజనలు ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఆధారంగా జరిగాయన్నారు.

ర్యాలీ

ర్యాలీ

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఎపిఎన్జీవోలు విశాఖపట్నంలో భారీ ర్యాలీ తీశారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

నరసింహ స్వామి 1

నరసింహ స్వామి 1

కేంద్రమంత్రులు చిరంజీవి, సుశీల్ కుమార్ షిండే, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌ల వేషధారణలో ఉన్న వారిని నరసింహ స్వామి శిక్షిస్తున్నట్లుగా...

నరసింహ స్వామి 2

నరసింహ స్వామి 2

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వేషధారణలో ఉన్న వ్యక్తి పొట్ట చీలుస్తున్న నరసింహ స్వామి దృశ్యం.

మహిళ

మహిళ

విద్యుత్ ఉద్యోగులు సమ్మె కారణంగా నిన్నటి వరకు సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్ నిలిచిపోయింది. విశాఖలో ఓ మహిళ పిల్లాడిని ఎత్తుకొని దీపం వెలుగులో వంట చేస్తున్న దృశ్యం.

పని

పని

విద్యుత్ ఉద్యోగులు సమ్మె కారణంగా నిన్నటి వరకు సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్ నిలిచిపోయింది. విశాఖలో మహిళలు దీపం వెలుగులో పనులు చేసుకుంటున్న దృశ్యం.

వెలుగులేనివిశాఖ

వెలుగులేనివిశాఖ

విద్యుత్ ఉద్యోగులు సమ్మె కారణంగా నిన్నటి వరకు సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్ నిలిచిపోయింది. విశాఖలోని ఓ ప్రాంతంలో విద్యుత్ లేకపోవడంతో రోడ్డు ఇలా కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+