వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణబ్‌తో టి లీడర్స్, భార్యతో ఉత్తమ్ వేరుగా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీ మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా నేతలు రాష్ట్రపతికి వినతి చేశారు.

విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరును రాష్ట్రపతికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానా రెడ్డి, డికె అరుణ, ఎంపి వి హనుమంత రావులు వివరించారు. విభజన బిల్లుపై చర్చకు ఇచ్చిన సమాయాన్ని సీమాంధ్ర నేతలు సరిగా ఉపయోగించుకోవడం లేదని సభను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.

బిల్లుపై చర్చకు గడువు పెంచొద్దని రాష్ట్రపతిని దామోదర, జానా కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కావాలనే బిల్లును అడ్డుకుంటున్నారని ఎంపీ వీహెచ్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. మరోవైపు రాష్ట్రపతితో మంత్రి ఉత్తమ్ కుమార్ దంపతులు విడిగా సమావేశమయ్యారు.

ప్రణబ్ 1

ప్రణబ్ 1

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో కలిసి పుష్పగుచ్ఛం ఇస్తున్న కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు.

ప్రణబ్ 2

ప్రణబ్ 2

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో కలిసి తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్న మంత్రి జానా రెడ్డి.

ప్రణబ్ 3

ప్రణబ్ 3

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో కలిసిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముసాయిదా బిల్లు పైన మాట్లాడుతూ...

ప్రణబ్ 4

ప్రణబ్ 4

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో కలిసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు జానా రెడ్డి, విహెచ్, దామోదర తదితరులు.

ప్రణబ్ 5

ప్రణబ్ 5

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణితో కలిసి విడిగా సమావేశమయ్యారు.

ప్రణబ్ 6

ప్రణబ్ 6

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని గవర్నర్ నరసింహన్ కలిశారు. అపోలో చైర్మన్, కామినేని ఆసుపత్రి డైరెక్టర్ ప్రణబ్‌కు ఓ పుస్తకాన్ని బహూకరిస్తున్న దృశ్యం.

ప్రణబ్ 7

ప్రణబ్ 7

ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్, సభ్యులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం కలిశారు.

English summary
Delegation of Council of Ministers and MPs (LS/RS) and other leaders led by Geeta Reddy, Hon’ble Minister for Major Industries, Govt. of Andhra Pradesh called on President of India Sri Pranab Mukherjee at Rashtrapathi Nilayam, Bollarum on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X