చిరు, కిరణ్‌లు ఒక్క'టై', మహిళా నేతల షాక్(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద బుధవారం ఉదయం హైడ్రామా సాగిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేసేందుకు ఎపి భవన్ నుండి బయలుదేరుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
కిరణ్ తన కాన్వాయ్‌లో బయలుదేరగా తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర కాంగ్రెసు నేతలు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనం ముందు బైఠాయించారు.
మంత్రులు శ్రీధర్ బాబు, గీతా రెడ్డి, సునిత లక్ష్మా రెడ్డి, డికె అరుణ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, శాసన మండలి సభ్యులు షబ్బీర్ అలీ తదితరులు ఆయన వాహనం ముందు బైఠాయించారు.

ఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద బుధవారం ఉదయం హైడ్రామా సాగిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేసేందుకు ఎపి భవన్ నుండి బయలుదేరుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

ఢిల్లీ
కిరణ్ తన కాన్వాయ్‌లో బయలుదేరగా తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర కాంగ్రెసు నేతలు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనం ముందు బైఠాయించారు.

ఢిల్లీ
మంత్రులు శ్రీధర్ బాబు, గీతా రెడ్డి, సునిత లక్ష్మా రెడ్డి, డికె అరుణ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, శాసన మండలి సభ్యులు షబ్బీర్ అలీ తదితరులు ఆయన వాహనం ముందు బైఠాయించారు.

ఢిల్లీ
దీంతో కిరణ్ తన వాహనం దిగి అక్కడే అంతకుముందు ఏర్పాటు చేసిన బస్సులో ఎక్కారు. ఆయన జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ బస్సెక్కారు.

ఢిల్లీ
బస్సు ముందు కూడా తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు నేతలు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుండి పక్కకు తప్పించారు. ఈ సమయంలో పోలీసులు, తెలంగాణ ప్రాంత నేతలకు మధ్య తోపులాట జరిగింది.

ఢిల్లీ
సీమాంధ్ర కాంగ్రెసు నేతలు కూడా తెలంగాణ నేతలను అడ్డుకున్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఢిల్లీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు, రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి తదితరులు మౌన దీక్షలో కూర్చున్నారు.

ఢిల్లీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు, రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి తదితరులు మౌన దీక్ష ముందు రాజ్ ఘాట్‌లో నివాళులు అర్పిస్తూ..

ఢిల్లీ
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మౌన దీక్షను చేశారు. ఈ దీక్షలో పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు పాల్గొన్నారు.

ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయనున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలంగాణ ప్రాంత మహిళా మంత్రులు గీతా రెడ్డి, డికె అరుణ, సునిత లక్ష్మా రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు.

ఢిల్లీ
మహిళా మంత్రులం అని కూడా చూడకుండా తమను పోలీసులు ఈడ్చి వేస్తుంటే ముఖ్యమంత్రి రాక్షసానందం పొందుతున్నారని వారు ధ్వజమెత్తారు.

ఢిల్లీ
ముఖ్యమంత్రి దీక్ష ప్రాంగణానికి వెళ్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై డికె అరుణ, గీతా రెడ్డి, సునితలు స్పందించారు.

ఢిల్లీ
ముఖ్యమంత్రిది అహంకారపూరిత వైఖరి అని, నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. సిఎం తీర్మానంలో తాము భాగస్వామ్యులం కాదల్చుకోలేదన్నారు.

ఢిల్లీ
మహిళా మంత్రులను కూడా ఈడ్చి వేస్తుంటే ఆనందం పొందుతున్నారా అని ప్రశ్నించారు. ఈ మౌన దీక్ష ఎందుకు చేస్తున్నారో కిరణ్ చెప్పడం లేదన్నారు.












Click it and Unblock the Notifications