కెసిఆర్ 'కృష్ణ' లీల: కూతురు కవిత ఆగ్రహం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించలేనప్పుడు బిల్లును వెంటనే కేంద్రానికి వాపస్ పంపించాలని సంపూర్ణ తెలంగాణ సాధన దీక్షలో నాయకులు డిమాండ్ చేశారు. ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణ సాధన కోసం టిజెఎసి నాయకత్వంలో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష చేపట్టారు.
ఈ దీక్షలో కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఢిల్లీ వెళ్లి వివిధ పార్టీల నాయకులను కలిసి తెలంగాణకు మద్దతు కూడగట్టనున్నట్టు తెలిపారు. బిల్లుపై చర్చించడం ద్వారా సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను ఆ ప్రాంత నాయకులు వివరించవచ్చునని అన్నారు.
కానీ చర్చను అడ్డుకోవడం ద్వారా సీమాంధ్ర నాయకులు తమ ప్రాంత ప్రజలకే అన్యాయం చేస్తున్నారని అన్నారు. ముసాయిదా బిల్లులో 13 సవరణలు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభిప్రాయం చెప్పే అవకాశం మాత్రమే అసెంబ్లీకి ఉంటుందని, నిర్ణయం తీసుకునే అధికారం ఉండదని, అధికారం పార్లమెంటుకే ఉందని అన్నారు.

కోదండరామ్
"రాష్ట్రపతి పంపించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై శాసన సభలో చర్చిస్తారా చర్చించండి. లేదంటే తిప్పి రాష్ట్రపతికి పంపించేయండి. సభలో చర్చ సాగకుండా ఇంకా బిల్లును ఇక్కడే పెట్టుకుకూర్చుంటామంటే కుదరదు. తెలంగాణకు అనుకూలమైన సవరణల సంగతిని ఢిల్లీలోనే తేల్చుకుంటాం. మాకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణే కావాలి '' అని తెలంగాణ ఐకాస చెప్పింది.

కృష్ణుడిగా కెసిఆర్
తెలంగాణ ఐక్యకార్యాచరణ సితి ఆధ్వర్యంలో జరిగిన సంపూర్ణ తెలంగాణ దీక్షలో శ్రీకృష్ణుడి వేషంలో తెరాస అధ్యక్షులు కెసిఆర్‌ను చిత్రీకరించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఐకాస
విభజన బిల్లుపై సభ అభిప్రాయం మాత్రమే చెప్పాల్సి ఉంటుందని, సవరణలు చేసే అధికారం లేదని ఐకాస స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను ఇక్కడి సభలో అభిప్రాయాల వ్యక్తీకరణ సందర్భంలో అనుసరిస్తామంటే కుదరదని హెచ్చరించింది.

తెలంగాణవాదులు
ఏ సభకైనా రూల్స్ కమిటీ ఉంటుందని, ఆ కమిటే విధాన ప్రక్రియను రూపొందిస్తుందని.. ఈ ప్రక్రియ అధ్యయనం కోసం స్పీకర్ లక్నో, పాట్నాకు వెళ్లడం సిగ్గుచేటని విమర్శించింది.

శ్రీనివాస్ గౌడ్
సభలో చర్చ సాగకుండా మంత్రులు అడ్డు పడుతున్నా... ఎలాంటి చర్యలు తీసుకోకుండా గవర్నర్ దోషిగా మిగిలిపోతున్నారని మండిపడ్డారు.

పోచారం
రాష్ట్రపతి పంపించిన బిల్లుపై శాసన సభలో చర్చ జరగాలని, సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించాలని, వారికి ఏమి కావాలో సీమాంధ్రులు చెప్పాలని పోచారం సూచించారు.

కె కేశవ రావు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల విభజనపై పూర్తి అధికారం పార్లమెంటుకే ఉంటుందని, రాష్ట్రానికి ఎలాంటి అధికారాలుండవని నేతలు చెప్పారు.

కవిత
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బ్యాట్ పట్టుకుంటే తెలంగాణ ప్రాంత మహిళలు బాంబులు విసురుతారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications