ఫొటోలు: రోడ్లపై ఆడారు, టీచర్లు రోడ్లు ఊడ్చారు
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గురువారంనాడు కూడా సీమాంధ్ర ఉద్యమాలు కొనసాగాయి. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై యాభై రోజులు దాటింది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో సమైక్యాంధ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి.
విశాఖపట్నంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విశాఖపట్నంలో జివిఎంసి టీచర్లు రోడ్లు ఊడ్చారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. మహిళా కళాశాల ఉద్యోగులు సమ్మె చేశారు.
తిరుపతిలో విద్యార్థినీవిద్యార్థులు రోడ్ల మీదికి వచ్చారు. రోడ్ల మీదనే ఆటపాటా సాగించారు. వివిధ వేషధారణల్లో రాష్ట్ర విడిపోతే కలిగి నష్టాలపై వివరించారు. ఈ నష్టాలను వివరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. తిరుపతిలో కేంద్ర ప్రభుత్వోద్యోగులు కూడా తమకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. తమకు మద్దతుగా విధులు బహిష్కరించాలని వేడుకున్నారు.

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు..
సమైక్యాంధ్రకు మద్దతుగా వాణిజ్య పన్నుల శాఖ విశాఖ డివిజన్ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. నోళ్లకు గుడ్డలు కట్టుకుని వారు ప్రదర్శనలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించారు.

టిడిపి, కాంగ్రెసు గొడవ..
సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలుగుదేశం, కాంగ్రెసు కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. విశాఖపట్నం జివిఎంసి వద్ద ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

దిష్టిబొమ్మ దగ్ధం
విశాఖపట్నం జివిఎఎంసి వద్ద తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య గొడవలో భాగంగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగానే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది.

రాహుల్ గాంధీ చిత్రపటం దగ్ధం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. దీంతో కాంగ్రెసు, తెలుగుదేశ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

ఇలా నిరసన
రాష్ట్ర విభజనను నిరసిస్తూ జెటి రామారావు ఇలా నిరసన వ్యక్తం చేశాడు. సమైక్యాంధ్ర ప్లకార్డు ప్రదర్శిస్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు.

న్యాయవాదుల ధర్నా
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో న్యాయవాదులు ధర్నాకు దిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

రోడ్లు ఊడ్చిన టీచర్లు
జివిఎంసి టీచర్లు విశాఖపట్నంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రోడ్లు ఊడ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు.

లెక్చరర్ల సమ్మె
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో మహిళా కళాశాల లెక్చెరర్లు సమ్మె చేశారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వారు రోడ్డుపై బైఠాయించారు.

తెరాస దిష్టిబొమ్మ దగ్ధం
రాష్ట్ర విభజనకు కారణమంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశాఖపట్నంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కళ్లు మూసుకుని..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా యువకులు తిరుపతిలో కళ్లు మూసుకుని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు డిమాండ్ చేశారు.

ముసుగులు ధరించి..
సోనియా గాంధీ, కెసిఆర్, చిరంజీవి ముసుగులను ముఖాలకు తగిలించుకుని తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీ సిబ్బంది రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

కుమ్మరి చక్రం...
సమైక్యాంధ్రకు అనుకూలంగా కుమ్మరి చక్రం తిప్పుతూ ఇలా ప్రదర్శన చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఈ ప్రదర్శన నిర్వహించారు.

కొబ్బరి కాయలు కొడుతూ..
తిరుపతిలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వినూత్న ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై కొబ్బరి కాయలు కూడా తమ నిరసనను వ్యక్తం చేశారు.

రోడ్డుపై రాతలు..
విద్యార్థినులు రోడ్డుపై కూర్చుని ఇలా రాస్తూ కనిపించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు ఈ పనికి పూనుకున్నారు. వారి మధ్య అల్లూరి సీతారామరాజు వేషధారి ఇలా కనిపించాడు.

కబడ్డీ ఆడుతూ..
తిరుపతిలో సమైక్యాంధ్రకు అనుకూలంగా విద్యార్థులు రోడ్డుపైనే కూత పెట్టారు. రోడ్డుపై కబడ్డీ ఆడుతూ విద్యార్థులు రాష్ట్ర విభజనకు తమ నిరసనను వ్యక్తం చేశారు.

స్కిప్పింగ్ చేస్తూ..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విద్యార్థినులు స్కిప్పింగ్ చేస్తూ తిరుపతిలో ఇలా.. మిగతావాళ్లు ఇతర ఆటల్లో మునిగితేలారు.

రోడ్డుపై క్యారమ్స్
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆందోళనకారులు రోడ్డుపై క్యారమ్స్ ఆడుతూ కనిపించారు. ఈ రకంగా సమైక్యాంధ్రకు తమ మద్దతును ప్రకటించారు.

వివిధ వేషధారణల్లో...
తిరుపతిలో పిల్లలు వివిధ వేషాలు ధరించి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. గణపతి ముఖం ముసుగు ధరించిన పిల్లాడిని కూడా చూడవచ్చు.

విడిపోతే ఇలా నష్టం..
రాష్ట్ర విడిపోతే జరిగే నష్టాలను తెలియజేస్తూ పిల్లలు ప్రదర్శన నిర్వహించారు. వివిధ ఫలాలను ప్రదర్సిస్తూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ వారు విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

యాభై రోజులు దాటింది..
యాభై రోజుల సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రతీకగా తిరుపతిలో ఆందోళనకారులు ఇలా నిరసన ప్రదర్శన చేశారు. యాభై అంకెను హారంగా ఏర్పడి సంకేతించారు. ఈ చిత్రం చూడండి..

ఒంటికాలిపై నిరసన
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆందోళనకారులు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.

దండం పెడుతూ..
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తమతో కలిసి రావాలని తిరుపతిలోని ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను దండాలు పెట్టి పిలిచారు.












Click it and Unblock the Notifications