హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమె చెన్నై ముదురు!: మహిళ సహా అరెస్ట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పని చేస్తున్న సంస్థకు ఓ ఉద్యోగస్తురాలు కన్నం వేసింది. ఆమెకు మరో ముగ్గురు సహకరించారు. వారిని పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు.

వారి నుండి ఏడు లక్షల రూపాయల విలువ చేసే 23.8 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సత్యనారాయణ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.

చెన్నైకి చెందిన ఎస్ లోకేశ్వరి కుటుంబం నాలుగేళ్ల కిందట హైదరాబాదుకు వచ్చి సోమాజీగూడలో ఉంటోంది. బీఎస్పీ జువెల్లర్స్‌లో లోకేశ్వరి సేల్స్ మేనేజర్‌గా పని చేస్తోంది.

దొంగతనం

దొంగతనం

జువెల్లర్స్ యజమాని ప్రవీణ్ కుమార్ గౌడ్ పూర్తి నమ్మకంతో వ్యాపార లావాదేవీలు, రోజు వెరి లెక్కల బాధ్యతను ఆమెకు అప్పగించాడు. కాగా, ఉద్యోగిని దొంగిలించిన నగల చిత్రం.

 దొంగతనం

దొంగతనం

దీనిని ఆసరాగా తీసుకున్న లోకేశ్వరి.. తన స్నేహితుల అవసరాల నిమిత్తం కొన్ని బంగారు నగలు ఇస్తా.. వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోండి.. తొందరగా బాకీ తీర్చి నగలు ఇవ్వండి అంటూ సలహా ఇచ్చి, దుకాణం నుండి బంగారు నగలు దొంగిలించింది. ఆ నగలను బోరబండలోని పాన్ బ్రోకర్ గీగా రామ్ వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు., కాగా, అరెస్టైన వారు.

దొంగతనం

దొంగతనం

ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో దుకాణంలో బంగారు నగలపై అనుమానం రావడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాఫ్తులో లేకేశ్వరి నిజం ఒప్పుకుంది.

దొంగతనం

దొంగతనం

చెన్నై నుండి కొంతకాలం క్రితం హైదరాబాదుకు వచ్చిన లోకేశ్వరి అని మహిళ తాను పని చేస్తున్న దుకాణంలో దొంగతనం చేసి అరెస్టయింది.

English summary
Photos of Woman arrested for theft in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X