బాబు కళ్లార్పకుండా, భార్య నగలు...: జగన్(పిక్చర్స్)
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
పార్టీ కర్నూలు జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్లు ఆర్పకుండా అబద్దం చెప్పే ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నారు.
అబద్దం చెప్పకపోతే ప్రజలు రాళ్లతో కొడతారని బాబుకు తెలుసన్నారు. అందుకే రోజుకో అబద్దమాడుతున్నాడని ఆరోపించారు.

జగన్
పార్టీ కర్నూలు జిల్లా సమీక్ష సమావేశంలో జగన్ మాట్లాడారు. కళ్లు ఆర్పకుండా అబద్దం చెప్పే ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నారు.

జగన్
అబద్దం చెప్పకపోతే ప్రజలు రాళ్లతో కొడతారని బాబుకు తెలుసన్నారు. అందుకే రోజుకో అబద్దమాడుతున్నాడని ఆరోపించారు.

జగన్
రాష్ట్రంలో దిక్కుమాలి, దుర్మార్గపు పాలన సాగుతోందని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తానన్నారు.. కానీ కనీసం వడ్డీ కూడా మాఫీ కాలేదన్నారు.

జగన్
కొత్త రుణాలు లేక, కరువు వచ్చినా బీమా తీసుకోలేని పరిస్థితి రైతులకు ఉందని, ప్రజలు విసుగెత్తి పోయారని, వారి సమస్యల పైన పోరాడుతామన్నారు.

జగన్
ఎన్నికల ముందు రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకులోని బంగారం ఇంటికి రావాలని చంద్రబాబు ఊదరగొట్టారని, ఇప్పుడు బ్యాంకుల్లోని బంగారం వేలం పెడుతున్నారన్నారు.

జగన్
అయితే, ఆయన భార్య మెడలోని నగలు మాత్రం అట్లానే భద్రంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. చివరకు అవ్వాతాాతలకు పింఛన్లకు కూడా కోత పెడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications