PIC TALK : ఫైర్ బ్రాండ్స్ ఒకే ఫ్రేమ్ లో - మంత్రి రోజాతో మాజీలు ఇలా..!!
వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఓకే ఫ్రేమ్ లోకి వచ్చారు. ఒకే చోట కలిసారు. వారంతా ఎప్పుడూ కలుస్తూనే ఉంటారు. కానీ, ఈ సారి వారి కలయికకు ప్రత్యేకత ఉంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రోజా తొలి సారి ఇన్ ఛార్జ్ మంత్రి హోదాలో క్రిష్ణా జిల్లాకు వచ్చారు. ఇంఛార్జ్ మంత్రిగా జిల్లాకు తొలి సారిగా వచ్చిన రోజా కు కలెక్టర్...ఎస్పీతో సహా అధికారులు స్వాగతం పలికారు. అయితే, పార్టీలో రోజాతో పాటుగా ఫైర్ బ్రాండ్స్ గా ముద్ర ఉన్న మాజీ మంత్రులు కొడాలి నాని...పేర్ని నాని సైతం మంత్రి రోజాను కలిసారు.
జిల్లా మంత్రి జోగి రమేష్ సైతం అక్కడే ఉన్నారు. కానీ, గెస్ట్ సీట్లో రోజా ఉండగా..విజిటర్స్ సీట్లో మాజీ మంత్రులు కనిపించారు. ఏపీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన క్రిష్ణా జిల్లా నడిబొడ్డున చోటు చేసుకున్న ఈ సన్నివేశం...ఈ ఫొటో ఇప్పుడు వైసీపీ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. రోజా - కొడాలి నాని వైసీపీ లో తొలి నుంచి సఖ్యతగా ఉంటున్నారు. వీరు సీఎం జగన్ కు వీర విధేయుడు. వారిద్దరి టార్గెట్ టీడీపీ అధినేత చంద్రబాబు. రోజా మంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కొద్ది సేపు ఉన్న కొడాలి నాని తరువాత వెళ్లిపోయారు. తన నియోజకవర్గంలో కార్యక్రమం కావటంతో స్థానిక ఎమ్మెల్యేగా పేర్ని నాని పూర్తిగా హాజరయ్యారు. జిల్లా మంత్రిగా జోగి రమేష్ తో కలిసి రోజా ఆ కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే, సీఎం జగన్ వ్యూహాత్మకంగానే క్రిష్ణా జిల్లా ఇంఛార్జ్ మంత్రి గా రోజాకు బాధ్యతలు కేటాయించారు. అయితే, కొడాలి నాని - పేర్ని నాని తమకు మంత్రి పదవులు లెక్క కాదని.. సీఎం జగన్ మూడేళ్ల క్రితమే రెండున్నారేళ్లకే పదవులు మారుతాయని చెప్పిన విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చారు. కానీ, రోజా మంత్రిగా.. ఇద్దరు నానీలు మాజీ మంత్రుల హోదాలో రోజాను కలవటం.. వారంతా ఒకే ఫ్రేమ్ లో ఉండటం ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది.
