Pic Talk: ఆయన గైడ్‌లైన్స్ తీసుకున్నా: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో సాయిరెడ్డి కీలక భేటీ
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్‌ను అధికార వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయి రెడ్డి కలుసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భిన్న ధృవాల వంటి నేతలు వారిద్దరు. ఆర్ఎస్ఎస్‌ను భారతీయ జనతా పార్టీకి మాతృసంస్థగా చెబుతుంటారు. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంటుందనే విషయం బహిరంగ రహస్యమే.

అంతర్వేదిలో పూజలు..
కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ ఆర్ఎస్ఎస్ సూచించిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దో, గొప్పో ప్రాధాన్యత ఇస్తుంటుందని చెబుతుంటారు. అలాంటి కీలక సంస్థకు అధినేతగా ఉన్న మోహన్ భగవత్‌ను విజయసాయి రెడ్డి కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోహన్ భగవత్ ఈ ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని దర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు.

పాలకొల్లులో ఆర్ఎస్ఎస్ సభలో..
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, స్వయం సేవకులు, స్థానిక ప్రజలు ఆయనను కలుసుకున్నారు. గత సంవత్సరంలో దగ్ధమైన స్వామివారి రథాన్ని, ఏపీ ప్రభుత్వం నిర్మించిన నూతన రథాన్ని పరిశీలించారు. వాటి వివరాలను ఆలయ అధికారులు, అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆర్‌ఎస్‌ఎస్ సభకు హాజరయ్యారు. 'శివాజీ జీవిత చరిత్ర' పుస్తకాన్ని ఆవిష్కరించారు.

నరసాపురంలో భేటీ..
అనంతరం ఆయన రైలులో నాగ్‌పూర్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా నరసాపురంలో విజయసాయి రెడ్డి మోహన్ భగవత్‌ను కలుసుకున్నారు. ఇది మర్యాదపూరకంగా తాను మోహన్ భగవత్‌ను కలుసుకున్నానని చెప్పారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నానని పేర్కొన్నారు. ఆయన నుంచి గైడెన్స్ తీసుకున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి ఓ ట్వీట్ చేశారు. మోహన్ భగవత్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

ఢిల్లీపై పట్టు ఉన్న నేతలు
ఇది కాస్తా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో వైసీపీ తరఫున చక్రం తిప్పుతున్న నేతగా విజయసాయి రెడ్డికి పేరుంది. ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ లభించిన సమయంలో మాత్రమే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తినకు బయలుదేరి వెళ్తుంటారు. దేశంలోనే నాలుగో అతి పెద్ద రాజకీయ పార్టీగా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ హోదాలో మిగిలిన సమయంలో విజయసాయి రెడ్డి ఢిల్లీలో హవా నడిపిస్తుంటారు. బీజేపీ పెద్దలను తరచూ కలుస్తుంటారు. కేంద్రంపై మోహన్ భగవత్‌కూ మంచి పట్టు ఉంది.
కీలక విషయాల్లో గైడెన్స్..
అదే బీజేపీకి పెద్ద తలకాయగా వ్యవహరిస్తోన్న మోహన్ భగవత్‌ను సాయిరెడ్డి కలుసుకోవడం, ఆయన నుంచి తాను గైడెన్స్ తీసుకున్నానని స్వయంగా ట్వీట్ చేయడం ఆసక్తి కలిగించే విషయం. ఏ విషయంలో గైడెన్స్ తీసుకున్నారనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. అయినప్పటికీ.. ఎన్డీఏలో వైసీపీ చేరిక అనే విషయం మీద ప్రధానంగా వారిద్దరి మధ్య చర్చలు సాగిఉంటాయని చెబుతున్నారు. దీనితో పాటు- ఆలయాల పరిరక్షణ విషయంపైనా కొన్ని సూచనలు చేశారనే ప్రచారం ఉంది.

ఆలయాల పరిరక్షణపైనా..
ఎన్డీఏలో చేరాలంటూ ఇదివరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం వైఎస్ జగన్‌ను ఆహ్వానించినప్పటికీ.. ఆయన తిరస్కరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తే నిరభ్యంతరంగా ఎన్డీఏలో చేరుతామని స్పష్టం చేశారు. అక్కడ మెలిక పడటంతో అది సాధ్యం కాలేదు. అక్కడితో ఆగిపోయింది.
ఇప్పుడు తాజాగా మళ్లీ అదే అంశం మీద ఆ ఇద్దరు నేతల మధ్య సంభాషణ జరిగి ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. ఆలయాల పరిరక్షణ విషయంలో వెనకడుగు వేయొద్దని, ధర్మాన్ని కాపాడటానికి రాజీపడొద్దని మోహన్ భగవత్ సూచించినట్లు చెబుతున్నారు. దీనికి అవసరమైన కొన్ని మార్గదర్శకాలు చేసి ఉంటారని అంటున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications