బాలు తలపై చిరంజీవి ముద్దు, డైలాగ్ చెప్పి మురిపెం (పిక్చర్స్)
హైదరాబాద్: కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారిని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నాడు. ఆ రకంగా బాలుడిని చిరంజీవి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ చిన్నారితో కొంత సమయం గడిపి, మంచి మాటలు చెప్పి ఆత్మవిశ్వాసంతో ఉండాలని ధైర్యం చెప్పారు. ఈ సంఘటన రాజధానిలోని ఎంఎస్‌జె కేన్సర్ ఆసుపత్రిలో గురువారం జరిగింది.
ఆదిలాబాద్‌కు చెందిన పదేళ్ల బాలు అనే చిన్నారి గత ఏడాదిగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ బాలుడు కోలుకుంటుందని, మంచి వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. బాలు మాత్రం ఎప్పుడూ దిగులుతో ఉండేవాడు. ఆ బాలుడు చిరంజీవి అభిమాని కావడం విశేషం. ఏ విధంగానైనా చిరంజీవిని కలిసి కొద్ది సేపు ముచ్చటించాలని బలమైన ఆకాంక్ష ఆ బాలుడికి ఉంది.

బాలుకు చిరంజీవి బహుమతి
చిరంజీవి ఆకర్షణీయమైన, ఖరీదైన అనేక బహుమతులను బాలుకు తీసుకెళ్లారు. బాలు వద్ద కూర్చుని అనేక కబుర్లు చెప్పారు.

చిరంజీవి అంటే అభిమానం
బాలుకు ఇంద్ర సినిమా అన్నా, చిరంజీవి డైలాగులు అన్నా చాలా ఇష్టం. ఇంద్ర సినిమాలో డైలాగులను బాలు చెబితే చిరంజీవి ఆశ్చర్యపోయి బాలును హత్తుకున్నారు.

డైలాగు చెప్పిన చిరంజీవి
మొక్కే కదా అని పీకేస్తే, పీక కోస్తా అనే డైలాగును మరీ అడిగడిగి చెప్పించుకున్నారు. తన 150వ సినిమాలో నటించేందుకు బాలుకు అవకాశం ఇస్తానని కూడా చిరంజీవి హామీ ఇచ్చారు.

తలపై ముద్దు
బాలు తలపై చిరంజీవి సున్నితంగా ముద్దు పెట్టారు. చిరంజీవితో ఆ బాలుడు ఉల్లాసంగా గడిపారు. ముచ్చట్లు చెప్పారు.

చిరంజీవికి తల్లిదండ్రులు ధన్యావాదాలు
తన కుమారుడి ఆకాంక్షను తెలుసుకుని ఆస్పత్రికి వచ్చి పరామర్శించినందుకు బాలుడి తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
కాని తన ఆకాంక్ష నెరవేరుతుందా, చిరంజీవి తనను చూడడానికి వస్తారా, ఒక వేళ తన తల్లితండ్రులతో కలిసి వెళితే చిరంజీవిని చూడనిస్తారా అనే ఆలోచనలతో ఆ పాప గత కొంత కాలంగా సతమతమవుతున్నాడు.
ఈ విషయాన్ని వైద్యులు మెగాస్టార్ చిరంజీవికి తెలియచేశారు. పైగా మీడియాలో కూడా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి క్రిస్మస్ రోజు గురువారం ఉదయం కేన్సర్ ఆసుపత్రికి వెళ్లి చిన్నారి బాలుతో కొంత సేపు గడిపారు.












Click it and Unblock the Notifications